బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం ఒక నెల రోజుల పాటు కాళ్ళు అరిగేలా ఆ ఆఫీస్ చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగితేనే సర్టిఫికెట్ మన చేతిలోకి వస్తుంది, ఇంకొన్ని సార్లు సర్టిఫికెట్ కోసం వేల రూపాయలని లంచం రూపంలో కూడా ఇవ్వాల్సి వస్తుంది, కానీ అలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చింది, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) అనే ఆన్ లైన్ వ్యవస్థని తీసుకువచ్చింది, దీని ద్వారా మనం ఇంట్లో ఉండే ఇంటర్నెట్ ద్వారానే బర్త్, డెత్ సర్టిఫికెట్లని ఆన్ లైన్ లో అప్లై చేసి ఏ ఆఫీసుకు వెళ్ళకుండానే పొందవచ్చు.ప్రభుత్వం నుంచి అందించే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం సివిల్ రిజిస్ట్రేషన్ పాలసీని ప్రవేశపెట్టి పైసా ఖర్చు లేకుండా ఇంటివద్ద నుంచే జనన, మరణ ధ్రువీ కరణ పత్రాలను అందజేస్తుంది.
సర్టిఫికెట్ నమోదు చేయాలనుకుంటే ముందుగా http://crsorgi.gov.in/web/index.php/auth/signUp లింక్ మీదా క్లిక్ చేసి మీ పేరు, ఊరు, ఈమెయిల్ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి.అందులో జనన లేదా మరణ ధ్రువీకరణకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.అప్లై చేసిన 15 రోజుల్లోగా మీ సర్టిఫికెట్ రెడీ అవుతుంది, దానిని మీరు ఇదే వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే పుట్టిన తేది లేదా మరణించిన తేది నుండి 21 రోజులలోగా ఈ వెబ్ సైట్ లో సర్టిఫికెట్ కోసం అప్లై చేయాలి.