సంపూర్ణేష్ బాబును చూసిన ఎవరైనా సరే, “ఇతను హీరో ఎంటిరా బాబు?” అని అనుకోకుండా ఉండరు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. కామెడీ చిత్రాలు చేసే సంపు తర్వాత పెద్ద పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. చాలా రోజులు తర్వాత సంపూర్ణేష్ బాబు లీడ్ రోల్ లో నటించిన మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. అక్టోబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం: మార్టిన్ లూథర్ కింగ్
- నటీనటులు: సంపూర్ణేష్ బాబు, నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్.
- దర్శకత్వం: పూజ కొల్లూరు
- నిర్మాతలు: వెంకటేష్ మహా, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, వై నాట్ స్టూడియోస్.
- మ్యూజిక్ : స్మరన్ సాయి
- విడుదల తేదీ: అక్టోబర్ 27
స్టోరీ:
ఒంగోలు జిల్లాలోని పడమరపాడు ఒక మారుమూల పల్లెటూరు. ఈ ఊరిలో రెండు వర్గాల ప్రజలు ఉంటారు ఉత్తరం, దక్షిణం పేరుతో ఆ రెండు వర్గాల వారిని పిలుస్తూ ఉంటారు. ఆ రెండు వర్గాల మధ్య ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ ప్రతి విషయంలోను గొడవ పడుతూనే ఉంటారు. ఆ రెండు వర్గాల వారిని కలపాలనే ఉద్దేశంతో ఆ ఊరి పెద్ద చాలా సంవత్సరాల క్రితమే రెండు వర్గాల నుండి ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకుంటాడు. అయినా సరే సమస్య తీరదు సరి కదా వీరికి జన్మించిన జగజ్జీవన్ రామ్ అలియాస్ జగ్గు (నరేష్) లోకమాన్య బాల గంగాధర్ తిలక్ అలియాస్ లోకి (వెంకటేష్ మహా) రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ గొడవలకు దిగుతూ ఉంటారు.
ఒకానొక సమయంలో ఊరిపెద్దకు అనారోగ్యం రావడంతో అతని స్థానంలో ఎవరు ప్రెసిడెంట్ గా ఎన్నికవ్వాలని చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో ఒక పక్క జగ్గు, మరోపక్క లోకి పోటీకి దిగుతారు. ఊరి మొత్తం మీద అన్ని ఓట్లు సమంగానే ఉండగా చెప్పులు కుట్టుకుంటూ బతుకు జీవనం సాగిస్తూ ఉండే స్మైల్ (సంపూర్ణేష్ బాబు) కొత్త ఓటు వారిద్దరికీ కొత్త ఊపిరి తీసుకొస్తుంది. అప్పుడే ఊర్లోకి వచ్చిన పోస్ట్ ఉమెన్ వసంత (శరణ్య ప్రదీప్) ఓటు విలువ తెలియజేసి మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరుతో కొత్త ఓటు పుట్టించి స్మైల్ కు ఇస్తుంది. ఆ ఓటు దక్కించుకునేందుకు స్మైల్ అడగకుండానే అతని ప్రలోభ పెట్టేలా ఎన్నో వస్తువులు తెచ్చిపెడుతూ ఉంటారు జగ్గు, లోకి.
వారి ప్రలోభాలకు మార్టిన్ లూథర్ కింగ్ తలొగ్గాడా? మార్టిన్ లూథర్ కింగ్ ఓటు కోసం పరితపించిన జగ్గు, లోకి ఎందుకు అతని చంపాలి అనుకున్నారు? ఓటు పుట్టించి వసంత మార్టిన్ లూథర్ కింగ్ కి మంచి పని చేసిందా? చెడు చేసిందా? చివరికి తన ఓటుతో మార్టిన్ లూథర్ కింగ్ ఏం చేశాడు? ఆ ఓటు ఎవరికి వేసి ఎవరిని గెలిపించాడు? అనేది ఈ సినిమా కథ.
రివ్యూ:
రాజకీయ నాయకుల మీద వారి స్వార్ధ బుద్ధిని ప్రతిబింబించేలా గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపు ఇది కూడా అలాంటిదే. ఒక పక్క ఓటు వెలుగు తెలియచెబుతూనే ప్రస్తుత రాజకీయాలకు చెంపపెట్టు అనేలా సెటైర్లు వేశారు. వాస్తవానికి ఇది ఒరిజినల్ సినిమా కాదు తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన మండేలా అనే సినిమాకి రీమేక్. అయితే తెలుగువారికి కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాని మలిచారు. ఊరిలో ఉన్న రెండు వర్గాల ప్రజలు మేము గొప్ప అంటే మేము గొప్ప అని కొట్టుకోవడం, అందుకోసం ప్రజాధనంతో కట్టిన ఆస్తులను సైతం ధ్వంసం చేయడానికి ఏమాత్రం వెనకాడకపోవడం లాంటి విషయాలను దర్శకురాలు పూజ కొల్లూరు బాగా చూపించింది.
స్త్రీలు, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారని తెలిసినా సరే రాజకీయాల కోసం పంతం నెగ్గాలనే ఒక అహంకారం ధోరణి కోసం రాజకీయ నాయకులు వారు అనుచరులు ఎంత దూరం వెళ్తారు అనే విషయాన్ని కూడా ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఎన్నికల్లో గెలిస్తే ఎవరికీ ఏం చేస్తావని అడిగితే లోకి అనే పాత్ర కుర్రాళ్ళు అందరిని గోవా తీసుకెళ్తా, బారులో ఏసి పెడతా అంటే ,జగ్గు అని పాత్ర మాత్రం ఒక్కొక్కరికి అకౌంట్లో 15 వేలు వేస్తా అని చెప్పడం ప్రస్తుత రాజకీయ నాయకుల హామీలను ప్రతిబింబించింది. సినిమా మొదట నుండి కామెడీ వేలో తెరకెక్కిస్తున్నట్టు అనిపిస్తుంది.
ఊరి జనం మధ్య గొడవలు ఆ గొడవలు కోసం ఎంత దూరంగా వెళ్లే వారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేది సెటైరికల్ గా చూపించారు. కింగ్ పాత్రతో అనేక ఎమోషన్స్ ను చూపిస్తూ ఆ పాత్ర ద్వారా సమాజంలో ఉన్న తక్కువ కులం ఎక్కువ కులం సహా అనేక అంశాలపై ఆలోచించేలా పంచులు వేసిన తీరు బాగుంది. అయితే ఈ సినిమా మండేలా రీమేక్ కాబట్టి కచ్చితంగా ఆ సినిమాతో పోలిక ఉంటుంది. మండేలా సినిమాని ముందు నుంచి కామెడీతో నడిపించి చివరిగా ఎమోషనల్ గా ముగించారు. కింగ్ పాత్ర ఫస్ట్ హాఫ్ అంతా నవ్విస్తుంది.
అయితే తమిళ్ లో కనెక్ట్ అయిన విధంగా ఇక్కడ కనెక్ట్ అవ్వదు. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. కింగ్ ఎమోషన్ అంతగా పండలేదు, అలాగే కంక్లూజన్ ఇవ్వకుండా జనం అర్థం చేసుకుంటారని వదిలేసినట్టు అనిపిస్తుంది. కామెడీ ఎమోషన్ పైన పూర్తిగా దృష్టి పెడితే రిజల్ట్ వేరేలా ఉండేది.
నటీనటుల విషయానికొస్తే మార్టిన్ లూథర్ కింగ్ పాత్రలో సంపూర్ణేష్ బాబు సరిగ్గా నప్పాడు. అమాయకమైన వ్యక్తిగా ఆకట్టుకున్నాడు. సర్పంచ్ అభ్యర్థులుగా వెంకటేష్ మహా, నరేష్ జీవించేశారు. పోస్ట్ విమెన్ గా శరణ్య ఆకట్టుకుంది. ఇంక సంపు వెంట ఉండే బుడ్డోడు కూడా చాలా బాగా నటించాడు. పెద్దాయన పాత్రలో రాఘవన్ తన పరిధి మేరకు బాగా నటించారు. టెక్నికల్ గా దర్శకురాలు పూజ కొల్లూరుని మెచ్చుకోవాలి.మొదటి సినిమా అయినా కూడా బాగా తరికెక్కించింది. స్మరన్ సాయి సంగీతం బాగుంది. దర్శకురాల ఎడిటర్ కాగా కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
- సంపూర్ణేష్ బాబు, ఇతర నటుల నటన
- కామెడీ సీన్స్
- మ్యూజిక్
- సెటైరికల్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- ఎమోషన్ పండకపోవడం
- ఎడిటింగ్
- అసంపూర్ణ ఎండింగ్.
రేటింగ్:
2.5/5
ట్యాగ్ లైన్:
ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా, సరదాగా సాగిపోయే ఒక సినిమా చూద్దాం అనుకునే వారిని ఈ సినిమా అలరిస్తుంది. కామెడీతో పాటు, సమాజంలో జరుగుతున్న విషయాల మీద కూడా ఒక మంచి సందేశం ఉండటంతో మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ఒక్కసారి చూడగలిగే సామాజిక సందేశం ఉన్న ఎంటర్టైనర్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
Also Read:“రవితేజ” నటించిన ఈ బయోపిక్ ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!