రక్షాబంధన్ రోజు పవన్ కూతురు ఆధ్య అన్న అఖిరానందన్ ని అడిగిన గిఫ్ట్ ఏదో తెలుసా?
రాఖీ పౌర్ణిమ కి భారత దేశం లో ఎలా జరుపుకుంటారో అందరికి తెలిసిందే.. అన్ని పండుగలాగే ఈ పండుగ కూడా అంతే ఉత్సాహంతో అన్న చెల్లెల్లు..ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. పేద ధనిక, సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వారికి ప్రతి ఒక్కరు ఇవాళ ఘనంగా జరుపుకున్నారు.
ఆలాగే రాఖీలు కట్టిన చెల్లెలమ్మలకి అన్నయ్యలు ఎదో ఒక గిఫ్ట్ ఇవ్వడం ఆనవాయితీ కూడా. ఆలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా నందన్, కూతురు ఆధ్య లు కూడా రాఖి కడుతున్న ఫోటోలు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ఇంస్టా గ్రామ్ లో పోస్ట్ చేసారు. ఈ సందర్బంగా రేణు ఏమని కాప్షన్ పెట్టారంటే “రక్షాబంధన్ పండుగ కి అసలైన అర్థం చెల్లిని అన్నయ్య తోడుగా ఉంటూ కాపాడుతానని అర్థం.
అయితే ఆధ్య ఈ సమాజం కోసం గిఫ్ట్ అడిగింది అసలు సమాజంలోనే ఎలాంటి చెడు లేకుండా చెయ్యాలని, అప్పుడు తాను కూడా రక్షణగా ఉంటాను కదా అని కోరింది. తన కోరికని చూసిన పవన్ ఫాన్స్ ఖుషి అవుతున్నారు.. పవన్ వారసులరివి శబాష్ అని పొగుడుతున్నారు.