ఈ సంక్రాంతికి టాలీవుడ్లో రెండు బడా చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ అయితే.. మరొకటి బన్నీ ‘అల.. వైకుంఠపురములో’. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాయి . ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం
సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ డే కలెక్షన్స్ : ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా 65 కోట్లు రాబట్టినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.గుంటూరు, కృష్ణ, నెల్లూరు జిల్లాల్లో సాలిడ్ కలెక్షన్లు రాబట్టి మహేష్ పట్టుబిగించినట్లు తెలుస్తోంది. న ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో దుమ్ముదులిపేసింది ఈ మూవీ.
అల.. వైకుంఠపురములో ఫస్ట్ డే కలెక్షన్స్ : ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 52 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు మార్కెట్ అనలిస్ట్‌లు లెక్కలు కట్టారు. అధికారిక లెక్కలు రావాల్సి ఉండగా.. షేర్ రూ. 36 కోట్లు రాబట్టిందని అంచనా.రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తొలి రోజు ఏపీ, తెలంగాణలలో దాదాపు రూ. 25 కోట్లు, ఓవర్సీస్లో 7 కోట్లుపైగానే వసూలు చేసినట్టు తెలుస్తోంది.