సెలెబ్రిటీస్ ఈ మధ్య చాల వరకు ప్రమోషన్స్ చేస్తున్నారు. కొందరు యాడ్స్ లో నటిస్తున్నారు, మరి కొందరు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న వాటికి తమ సోషల్ మీడియా లో ప్రమోట్ చేస్తూ ఉంటారు. అభిమానులు, ఫాలోయర్స్ తమ ఇష్టమైన వారిని ఫాలో అయ్యి వాటి పోస్టులు, వీడియోలు, స్టేటస్ లు చూసి సంతోషిస్తారు, అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు.
కానీ మధ్యలో చేస్తున్న ప్రమోషన్స్ కొన్ని సార్లు అవి చికాకు పెడుతూ ఉంటాయి. మరీ ఎక్కువ అవే చూసేససరికి కొందరు నెటిజన్స్ వారిపై అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇలాగె యాంకర్ హరి తేజ విషయం లో జరిగింది. నేను మీకో త్వరలో ఒక సర్ప్రైజ్ ఇస్తా అంటూ కొన్ని రోజులుగా పోస్ట్లు పెడుతూ వచ్చారు.
అంతే కాదు నేనేం చెప్పబోతున్నానో మీరు గెస్ చేయగలరా అంటూ నెటిజన్స్ కి పజిల్ వదిలారు. దీనితో హరి తేజ ఫాన్స్ మీరు మళ్ళీ తల్లి కాబోతున్నారా ?, ఆచార్య సినిమా లో నటించబోతున్నారా ? పవన్ సినిమా లో ఛాన్స్ కొట్టేశారా ? అంతో రక రకాల జవాబులకి ఒక్కసారిగా ఖంగు తిన్న హరి తేజ.
ఒక నెటిజెన్ అయితే మళ్ళీ బిగ్ బాస్ లోకి రే ఎంట్రీ ఇస్తున్నారా ? లేక మీ భర్త ని పంపిస్తున్నారా బిగ్ బాస్ కి అని జవాబు ఇచ్చాడు. ఇంకో నెటిజెన్ యు ట్యూబ్ ఛానల్ పెడుతున్నారా ?ఇంకా మీకు పని పాట లేదా అంటూ షాక్ ఇచ్చారు అసలు ఏమి చేయబోతున్నారో అన్నది ఇవాళ లైవ్ లో వచ్చి క్లారిటీ ఇవ్వనున్నారు.