గత కొన్ని సంవత్సరాలుగా బుల్లి తెర పైన ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న మేల్ యాంకర్స్ లో ఒకరు ‘రవి’. బుల్లితెర పైన బాగా పాపులారిటీ ని సంపాదించిన రవి అయన ప్రేక్షకులకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తారో అందరికితెలిసిందే. శ్రీముఖి తో కలిసి చేసిన రచ్చ అంత ఇంత కాదు..! ఇక గత కొన్ని రోజులు నుంచి బిగ్ బాస్ సీజన్ 5 లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సోషల్ మీడియా లో చాల సార్లు కంటెస్టెంట్ లిస్ట్ ఇదే అంటూ వైరల్ అయిన సంగతి తెలిసిందే..
ఇక అధికారికంగా తన సోషల్ మీడియా పేజీ నుంచి ఒక వీడియో ని పోస్ట్ చేసారు యాంకర్ రవి. ‘పోతున్నా పోతున్నా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోతున్న అంటూ చెప్పారు ఈ విషయం ముందే చెప్పనందుకు అందరికి సారీ..బిగ్ బాస్ వారి రూల్స్ ప్రకారం చెప్పలేకపోయాను..ఇక్కడి దాకా ఉండే కానీ చెప్పలేదు. ఇంతకు ముందు కూడా నాకు బిగ్ బాస్ హౌస్ లో వెళ్లే అవకాశం ఉన్నా కూడా వెళ్ళలేకపోయాను.
బయట ఉన్న కొన్ని కమిట్మెంట్స్ వలన అది కుదరలేదు. బిగ్ బాస్ షో అనేది పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి ఇంకా ఎక్కువ మందిని మనం ఎంటర్టైన్ చేయొచ్చు అనే ఉద్దేశం తో ఈ సీజన్లో లోకి ఎంట్రీ ఇస్తున్న అని అన్నారు. గత 11 సంవత్సరాల నుంచి ఎంటర్టైన్ చేస్తూనే వచ్చానని ఏడ్చేసిన రోజులు ఉన్నాయి, డిప్రెషన్ లోకి వెళ్లిన రోజులు ఉన్నాయి న ఫామిలీ మెంబెర్స్, వెల్ విషర్స్ సపోర్ట్ తోని ఆలా ముందు వచ్చానని అన్నారు. మీరందరు నాకు సపోర్ట్ చెయ్యండి లోపల ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎలా ఉన్న మిమల్ని ఎంటర్టైన్ చేయాలని మాత్రం గట్టిగా ఉందని ప్రయత్నిస్తానని చెప్పారు. ట్రోలర్స్ తనని ట్రోల్ చెయ్యండి కానీ మా ఫ్యామిలీ జోలికి వెళ్లొద్దు అని చెప్పారు.
ఇవి కూడా చదవండి: షణ్ముఖ్ ఎంట్రీ సమయంలో…నాగార్జున చేసిన ఈ పొరపాటును గమనించారా.?