చాలా మందికి జంతువులు అంటే అమితమైన ఇష్టం.ప్రతిఒక్కరికీ ఇంట్లో ఏదో ఒక జంతువు ఉంటుంది.అందులోనూ విశ్వాసం, ప్రేమ, అభిమానం మాత్రమే చూపించే కుక్కలు, పిల్లులు వంటి జంతువులను పెంచుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా కుక్కలు ఎటువంటి స్వార్థం లేకుండా యజమాని పట్ల ఎంతో ప్రేమగా, విశ్వాసంగా ఉంటాయి. కుటుంబ సభ్యులలో ఒకరిగా ప్రవర్తిస్తాయి.
పెంపుడు జంతువులను చాలా మంది వ్యక్తులు తమ పిల్లల్లా చూసుకుంటుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో లో బాగా వైరల్ అవుతుంది.ఓ మనిషికి, కుక్కకి మధ్య ఉన్న బంధం చూసి చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు. ఇది కదా జంతువులకి మనుషుల మధ్య ఉండే ప్రేమ అంటూ ఆనందం.
ఇంతకీ వైరల్ అవుతున్న వీడియోలో ఏముంది అంటే…. ఓ చిన్న పెంపుడు కుక్క ఇంటి బయట కూర్చునుంది. కారులో నుంచి దిగిన తన యజమానిని చూసి సంతోషంతో తోక ఊపడం ప్రారంభించింది. అతడు దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ పప్పీ ఆనందం రెట్టింపైంది. సంతోషంతో గెంతులు వేయడం ప్రారంభించింది. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి తన పెంపుడు కుక్కను ముద్దు పెట్టుకున్నాడు. ఆ కుక్క కూడా తన యజమానిని చూసిన సంతోషంలో గెంతులు వేసింది. ఒక్కసారి కుక్కని చేరదీస్తే అవి జీవితం మనల్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాయి.విశ్వాసం చూపిస్తూ ప్రేమను కనబరుస్తాయి.
ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 7.6 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 2.5 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు చాలామంది మంచి మంచి కామెంట్లు పెట్టారు.. ఎలాంటి షరతులూ లేని ప్రేమ అది, ఆ కుక్క ఎంత సంతోషపడుతోంది, ఆ ప్రేమలో కల్మషం లేదు, ఇలాంటి కుక్కలు ఉన్నప్పుడు ఇంటికి వెళ్లడం గొప్ప అనుభూతి అంటూ కామెంట్స్ చేశారు.మనం ఏదైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం పెంపుడు జంతువులతో కాసేపు సమయం వెచ్చిస్తే మన మనసు ఆహ్లాదంగా మారుతుందని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
watch video :
Dad coming home from work is the best part of her day… 🥰❤️ pic.twitter.com/OUlCUGiJXd
— B&S (@_B___S) November 17, 2023
Also Read:నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అని భార్య అడిగేసరికి…ఆ భర్త చెప్పిన ఈ ఆన్సర్ కరెక్ట్ అంటారా.?