‘జబర్దస్త్’ ప్రోగ్రాం ప్రతి గురు, శుక్రవారాల్లో ప్రసారం అయ్యే ఈ షో గత కొన్నిసంవత్సరాలుగా తెలుగు ప్రజలని అలరిస్తూ, ఆకట్టుకుంటూ ఉంది అంతేనా ఈ షో నుంచి ఎందరో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. కొందరు కమెడియన్స్ గా రాణిస్తూ ఉంటె మరికొందరు ఇక్కడే ఇదే ‘జబర్దస్త్’ స్టేజి పై స్థిర పడిపోయారు. మరి కొందరు జబర్దస్త్ ని వీడారు. అలా ఒక ఇమేజ్ వచ్చిన ఆర్టిస్టుల్లో ‘అవినాష్’ ఒకరు. ముక్కు అవినాష్ గా పిలుచునే ఈ జబర్బ్దస్త్ ఆర్టిస్ట్ బిగ్ బాస్ షో లో కూడా పాల్గొన్నారు.
కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రాం లో ప్రస్తుతం బిజీ గా ఉన్న అవినాష్ ఒక ఇంటి వాడు కాబోతున్నారు..ఇదే విషయం ఇప్పుడు నెట్ లో వైరల్ అయ్యింది. అమ్మాయి పేరు అనూజ. తనకి కాబోయే శ్రీమతి ని అందరికి పరిచయం చేసారు అవినాష్. చాల కాలంగా తమ ఫామిలీ కి పరిచయం ఉన్న వ్యక్తి. పెద్దలు కుదిర్చిన సంబంధం ఇక అన్ని కుదిరాయి. సో పెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇప్పుడు ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అంతే కాదు తన పాత స్నేహితులు ‘జబర్దస్త్’ కమెడియన్స్ అందరూ విషెస్ చెబుతున్నారు. కొంత కాలం క్రితం అవినాష్ కు, యాంకర్ అరియనా కి మధ్య ఎదో ఉందని గాసిప్స్ వినిపించాయి ఇక ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టారు అవినాష్.
ఇవి కూడా చదవండి: SUDIGALI SUDHEER: సుడిగాలి సుధీర్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా ? నెలసరి సంపాదన ఎంతంటే ?
ఇవి కూడా చదవండి:GETUP SRINU: గెటప్ శ్రీను రివర్సు పంచ్ కి సుధీర్, రామ్ ప్రసాద్ రియాక్షన్ చుడండి !