అయ్యప్ప మాల ధరించి స్కూల్ కి వెళ్ళిన విద్యార్థులకు చేదు అనుభవం ఎదురయింది. స్కూల్ కి వెళ్ళిన ఆ నలుగురు విద్యార్థులను లోపలికి అనుమతించకుండా క్లాస్ రూమ్ బయట నిలబెట్టి స్కూల్ యాజమాన్యం పనిష్ మెంట్ ఇచ్చింది. ఈ ఘటన హైదరాబాదులోని ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలోని మొయినాబాద్ పరిసరాల్లో ఉన్న పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ సంఘటన జరిగింది.
పూర్తి వివరాల్లోకెళ్తే అయ్యప్ప మాల ధరించి స్కూల్ కి వచ్చిన విద్యార్థులను లోపలికి రానివ్వమని వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి స్కూల్ కి రప్పించి యాజమాన్యం నానా హంగామా చేసింది. తల్లిదండ్రులు అక్కడికి చేరుకోగానే వారితో గొడవకు దిగింది. దీంతో తల్లిదండ్రులు సైతం కాసేపు ఆందోళన చేశారు.
విషయం తెలుసుకుని పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరికీ సర్దిచెప్పి వెళ్ళిపోయారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి అయ్యప్ప మాల ధరించి విద్యార్థులు నాలుగు రోజులుగా స్కూల్ కి వస్తున్న ఎలాంటి అభ్యంతరం చెప్పని యాజమాన్యం ఐదో రోజు మాత్రం విద్యార్థులను క్లాస్ రూమ్ లోకి రానివ్వమని అడ్డుకుంది.
మతపరమైన అంశాలను ప్రోత్సహించమంటు విద్యార్థులను అనుమతించకుండా బయట నిలబెట్టడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.స్కూల్ యాజమాన్యం వైఖరి పైన ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఈ ఘటనకు సంబంధించి వీడియో మొబైల్ లో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ స్కూల్లో ఎవరు జాయిన్ కావద్దు అంటూ వైరల్ చేశారు.
Also Read:అట్లతద్ది వల్ల ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందా..? ఎలా అంటే..?