ప్రస్తుత సమాజంలో మనదే తింటూ చివరికి మనల్ని వెన్నుపోటు పొడిచే వారు ఎక్కువగా ఉన్నారు. అలాంటివారిని ఎప్పుడు మన పక్కన ఉంచుకున్నా మన పక్కలో పాము లాంటి వారే. కాబట్టి అలాంటి స్వభావం కలిగిన వ్యక్తులను మన దరిచేరనీయకూడదు. చాణిక్యుడు కూడా అలాంటి వ్యక్తులకు సాయం చేస్తే అది మళ్లీ మనకే కీడులా వ్యాపిస్తుందని తెలియజేశారు. సమాజంలో అలా మూడు రకాల వ్యక్తులు ఉంటారని వారికి అస్సలు సాయం చేయకూడదని, అలాంటి వారిని దూరంగా ఉంచాలని తెలిపారు. మరి వారు ఎవరో ఒకసారి చూద్దామా..?
#1 కారణం లేకుండా అశాంతితో ఉండేవారు
ఆచార్య చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం ఎలాంటి కారణం లేకుండా వీరు అసంతృప్తితో ఉంటారు. దక్కిన టువంటి ఆనందంతో తృప్తి పడకుండా ఎప్పుడు విలపించే వీరికి దూరంగా ఉండాలి. ఇలాంటి వారే ఎప్పుడూ ఇతరుల సంతోషాన్ని చూస్తూ అసూయపడి వారిని తిట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఎలాంటి కారణం లేకుండా అసూయ పడుతూ ఎప్పుడు అశాంతితో బ్రతికే వీరికి దూరంగా ఉండాలని అంటున్నారు.
#2 చెడు గుణం గల స్త్రీ
క్రూరమైన, లక్షణ రహితమైన చెడు స్వభావం ఉన్నటువంటి స్త్రీతో సహచర్యంలో ఉన్నటువంటి పురుషుడు ఎప్పటికీ ఆనందాన్ని పొందలేడు. అలాంటి స్త్రీలు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పురుషుల వద్ద ఉంటారు. ఇలాంటి వారితో పరిచయం ఎప్పటికైనా సమాజంలో కానీ కుటుంబంలో కానీ అవమానం పాలు చేస్తుంది. అందుకే ఇలాంటి మహిళలతో దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు.తన నీతిలో తెలియజేశాడు.
#3 మూర్ఖులు
ఆచార్య చాణిక్యుడు చెప్పిన నీతి సూత్రాలు ప్రకారం మూర్ఖులైన పురుషులు లేదా స్త్రీలకు హితబోధ చేయవద్దని అన్నారు. మీరు మీ జ్ఞానంతో మూర్ఖులను మార్చాలనుకున్నా అది వారికి అర్థం కాదు. మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెడతాడు. దీనివల్ల మీ సమయంతో పాటుగా మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆచార్య చాణిక్యుడు అన్నారు.