టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి చంద్రబాబు అరెస్టు 53 రోజులు పైనే గడిచింది. ఇన్ని రోజుల నుండి చంద్రబాబు తరపు న్యాయవాదులు చంద్రబాబుకి బెయిల్ కోసం కోర్టులో వాదనలు వినిపిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు వారి వాదనలకు ఉపశమనం కల్పించే లాగా టిడిపి శ్రేణులకు ఆనందం కలిగించే వార్త చంద్రబాబు కి బెయిల్ మంజూరు కావడం. ఇది కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే. ఈరోజు ఉదయం హైకోర్టులో వాదనలు అనంతరం హైకోర్టు బెంచ్ చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే కేవలం నాలుగు వారాల పాటు మాత్రమే బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తెలిపింది. నవంబర్ 24 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేవలం చంద్రబాబు ఆరోగ్య కారణాలు దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా తెలిపింది.
బెయిల్ కండిషన్స్:
1.ఒక లక్ష చెప్పున రెండు షురిటిలు సమర్పించాలి .
2.సొంత ఖర్చులతో చికిత్స చేయించుకోవాలి.
3.చికిత్స, ఆసుపత్రి వివరాలు జైలుకు సమర్పించాలి.
4.కేసును ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రభావితం చేయకూడదు.
5.నవంబర్ 28 సాయంత్రం 5 గంటల లోపు సరెండర్ కావాలి.
అయితే ఈ 53 రోజుల నుండి జైలులో ఉన్న చంద్రబాబు పలు అనారోగ్యాలకు గురయ్యారు. చంద్రబాబుకి స్కిన్ సంబంధిత ఎలర్జీ వచ్చినట్లుగా ప్రభుత్వ వైద్యులు ప్రకటించారు. బాగా డిహైడ్రేషన్ కి గురి అవుతున్నారని వయసు కూడా ఎక్కువ కావడంతో జైలులో ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. మధ్య మధ్యలో ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు కూడా నిర్వహించారు.
చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రతివారం వెళ్లి మూలాఖత్ నిర్వహించి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబుకి బెయిల్ రావడం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు సంతోషం కలిగించినట్లే. అయితే నవంబర్ 24 తర్వాత ఏం జరుగుతుందనేది సస్పెన్స్.నవంబర్ 24 తర్వాత చంద్రబాబు మళ్ళీ జైలుకు వెళ్తారా లేక కోర్టుబెయిల్ పొడిగిస్తుందా అనేది వేచి చూడాల్సిన అంశం.