హీరో విజయ్ అంటే కోలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరో. ఆయన ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే సమానత్వం కలిగిన నటుడు అని చెప్పవచ్చు. నటన కానీ, రియల్ లైఫ్ లో కానీ ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటారు. అలాంటి హీరో తన జీవితంలో జరిగిన ఒక అనుకోని సంఘటన గురించి తెలియజేశాడు అది ఏంటో చూద్దాం..!
చాలా ఏళ్ళ తర్వాత మీడియా ముందుకు వచ్చిన విజయ్, పదేళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన వల్ల మీడియాకు దూరం అయ్యానని అన్నారు. బీస్ట్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పదేళ్ల గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు నెల్సన్ తో సరదాగా గడిపారు. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటుగా ఆసక్తికరమైన అంశాలు గురించి తెలియజేశారు విజయ్.
పది సంవత్సరాలు మీడియాకు దూరం : ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేనంత బిజీ గా అయితే నేను లేను. ఇంటర్వ్యూలు ఉంటే దానికి తప్పకుండా సమయాన్ని కేటాయిస్తాను. కానీ ఇంటర్వ్యూలకు దూరంగా ఉండడానికి ప్రధానమైన కారణం పది సంవత్సరాల కింద జరిగినటువంటి ఘటన. ఆ సమయంలో నేను ఇంటర్వ్యూలో మాట్లాడింది ఒకటయితే, దాన్ని మరోలా అన్వయించుకొని రాసుకున్నారు.
దీంతో ఆ విషయం సంచలనంగా మారిపోయింది. అందువల్ల మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇంత గ్యాప్ వచ్చింది. ఆ సంఘటన ఏంటనేది ఇప్పుడు చెప్పలేను కానీ, ఆ సమయంలో నేను మాట్లాడిన మాటలు వారు వివాదాస్పదం చేశారు. ఆ తర్వాతి రోజు పేపర్ లో, టీవీలో చూసి మాట్లాడింది నేనేనా అని షాక్ అయిపోయా. మా స్నేహితులు కుటుంబసభ్యులు కూడా నమ్మలేదు. ఇంట్లో వాళ్లకు అయితే నేను అలా మాట్లాడలేదు అని చెప్తే నమ్ముతారు. కానీ బయట వాళ్ళను నమ్మించలేను కదా అందుకే మీడియాకు దూరంగా ఉన్నాను.