ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి విద్యావంతుడు బిజినెస్ మాన్ అని అందరికీ తెలిసిందే. వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుని ఆంధ్రప్రదేశ్ సీఎం గా చిన్న వయసులోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అయితే జగన్మోహన్ రెడ్డి తన హావభావాలతోను, తన మాటలతోనూ అందరికీ బాగా గుర్తుంటారు. బాగున్నావా అక్క, బాగున్నావా అన్న, బాగున్నావా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. ఇవన్నీటిని జగనన్న ట్రేడ్ మార్క్ డైలాగులుగా చెబుతూ ఉంటారు. ఆ మాటలు ఆయన చెబితేనే అందంగా ఉంటాయి.అలాంటి జగనన్న మరో విషయంలో ఔరా అనిపిస్తున్నారు.
జగనన్న ఏదన్న కార్యక్రమాలు ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా పాఠశాలల్లో బోర్డుల పైన ఏదో ఒకటి రాస్తూ ఉంటారు. కార్యక్రమానికి సంబంధించిందో లేకపోతే విద్యార్థులకు సంబంధించిందో తన చేతితో రాస్తూ ఉంటారు. అయితే అప్పుడు జగనన్న హ్యాండ్ రైటింగ్ చూసిన ఎవరైనా సరే అబ్బా ఎంత బాగుంది అనకుండా ఉండరు. చాలా స్పష్టంగా అక్షరాలు అందరికీ అర్థమయ్యే విధంగా అందంగా రాస్తారు జగనన్న. తాజాగా జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభంలో భాగంగా బోర్డు పైన ఆ పథకం పేరు రాసి ప్రారంభించారు.
మోస్ట్ హ్యాండ్సమ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని వర్ణిస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైటింగ్ కూడా చాలా అందంగా ఉండడంతో హ్యాండ్సమ్ సీఎం విత్ హ్యాండ్ సమ్ రైటింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.విద్యార్థులు జగనన్న రైటింగ్ చూసి మీరు కూడా ఇంత అందమైన హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి అంటూ ఉపాధ్యాయులు వారికి సూచిస్తున్నారట.
మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటే పరీక్షల్లో బాగా రాయవచ్చు మంచి మార్కులు సంపాదించవచ్చని బోధిస్తున్నారట.సీఎం హ్యాండ్ రైటింగ్ ఏ బాగుండడంతో విద్యార్థులందరూ ఆయననే ఆదర్శంగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారుఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి విద్య వ్యవస్థలో ఎన్నో సమూలు మార్పులు తీసుకొచ్చారు విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించాలని కృషి చేస్తున్నారు.
Watch Video:
Also Read:పది నిమిషాల్లో పెళ్లి … అంతలోనే..? ఏం జరిగిందంటే..?