పవన్ కళ్యాణ్ హీరోగా మలయాళం రీమేక్ ‘అయ్యపనుం కోశియుమ్‘ ఇందులో విలన్ గా రానా దగ్గుబాటి కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ రే ఎంట్రీ తో ఫుల్ జోష్ లో పవన్ మరి హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ చిత్ర యూనిట్ విడుదల చేశారు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది.
bheemla nayak first look
ఈ సినిమా లో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా, ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్ నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి డైలాగ్స్ అందించనున్నారు. సంక్రాంతి కి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందికి తీసుకురావడనికి ప్రయత్నిస్తున్నారు. కోవిద్ సెకండ్ వేవ్ తరువాత ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మొదట నిత్యా మీనన్ పాత్రకి సాయి పల్లవి ని సంప్రదించిన షూటిగ్స్ బిజీ వలన డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారు. ఈ సినిమా కి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించనున్నారు.