Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 చివరి దశకి వచ్చేసింది. ఇక 13వ వారంలో ఫైమా ఎలిమినేట్ అయ్యింది. వాస్తవానికి ఫైమా లాస్ట్ వారం ఎలిమినేట్ కావల్సింది. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో సేఫ్ అయ్యి, ఆమె బదులుగా రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు.
ఇక ఫైమా ఒక వారం ఆలస్యంగా ఎలిమినట్ అయ్యింది. ఇక బిగ్ బాస్ గేమ్ మార్చాలనుకున్న ఆడియన్స్ మాత్రం ఓట్లు వేయడంలో కనికరం చూపించరు. ఆడియన్స్ ఎవర్ని బిగ్ బాస్ హౌస్ లో ఉంచాలి అనుకుంటే వారినే ఉంచుతారు. దాంతో 13వ వారం ఫైమా తప్పించుకోలేక ఎలిమినేట్ అయ్యింది. ఇక హౌస్ నుంచి ఎలిమినట్ అయిన కంటెస్టెంట్లు ఇంటర్వ్యూలు ఇస్తూండడం, వాటిలో షో పై రకరకాలుగా మాట్లాడటం వంటివి బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి కనిపిస్తూనే ఉన్నాయి. ఇక బయటకు వచ్చిన ఫైమా అదే విధంగా చేస్తుందా లేదో చూడాలి.
ఫైమా ఎలిమినేట్ అవడంతో ఆమె ఎంత పారితోషికం తీసుకుంది అనే విషయం పై చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఫైమా స్టార్టింగ్ లో బలమైన కంటెస్టెంట్లానే అనిపించింది. హౌస్లో కంటెస్టెంట్స్కి సంబంధించిన విషయాలు అన్ని తెలిసిపోతాయి. కానీ వాళ్ల పారితోషికం గురించి చర్చించుకోరు. కానీ బయటకు వచ్చినా కూడా వాళ్ల రెమ్యూనరేషన్ గురించి చెప్పరు. ఎందుకంటే బిగ్ బాస్ షో అగ్రిమెంట్లో వారి పారితోషికం వివరాల గురించి తెలపకూడదని నిబంధన ఉంటుంది. తాజాగా ఫైమా పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. ఆమె 13 వారాలు హౌస్లో ఉండటంతో భారీగానే పారితోషికం అందుకుందని రూమర్స్ వస్తున్నాయి.
13 వారాలకు గానూ, 22 లక్షలు అందుకుందని టాక్ వినిపిస్తోంది. అంటే ఆమె వారానికి 1, 75, 000 పారితోషికం తీసుకుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో వారానికి 1,70, 000 ఇప్పటివరకు జరిగిన సీజన్లలో ఏ కంటెస్టెంట్కి కూడా ఇవ్వలేదని, దాన్ని బట్టి చూస్తే ఫైమాకి ఒక వారానికి 25,000-30,000 ఇచ్చి ఉండవచ్చు అని ఇంతకు ముందు బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన వారు చెప్తున్నారు. వారి చెప్తున్న లెక్కన చూస్తే ఫైమాకి 13 వారాలకు కలిపి 3,90,000 మాత్రమే అవుతుందని మరో టాక్.

అందుకోసమే నిర్మాణ సంస్థల వారి నుంచి ప్యాకేజీలు మాట్లాడుకొని సినిమాకు హైప్ తీసుకు వస్తూ ఉంటారు. వారికి ఎన్ని డబ్బులు ఎక్కువగా ఇస్తే సినిమాకు అంత ప్రమోషన్ ఉంటుందన్నమాట. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ తో అదరగొడతారు. అయితే ఈ వ్యవస్థ సినిమా నుంచి బిగ్ బాస్ వరకు విస్తరించి పోయింది. ఎంతగా అంటే బిగ్ బాస్ షోలో ముందుకు రావాలి అంటే ఈ టీమ్ వుండాల్సింది అన్నట్టుగా తయారైంది.
బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో ఈ టీంల ప్రభావం ఎక్కువగా లేదు. సెకండ్ సీజన్ లో మాత్రం కౌశల్ విన్నర్ కావడానికి పిఆర్ టీం కారణం అనే ఆరోపణలు వచ్చాయి. ఇలా సీజన్ సీజన్ కు పిఆర్ టీమ్స్ విస్తరిస్తూ వస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే ప్రతి ఒక్క కంటెస్టెంట్ పిఆర్ టీమ్స్ ను పెట్టుకొని మరి హౌస్ లోకి వెళ్తున్నారని, ఈ సీజన్ లో అరియనా, బిందు మాధవి, మిత్రశర్మ, అఖిల్, స్రవంతి, శివ, హమీద ఇలా చాలా మంది ఈ పిఆర్ టీమ్స్ ను పెట్టుకొని హౌస్ లోకి వెళ్లారని తెలుస్తోంది.
ఈ టీమ్ వారు వాళ్ల యొక్క సోషల్ మీడియా ఖాతాలను డీల్ చేస్తూ.. ప్రమోషన్స్ కు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఓట్లు వేయించడంలో ముందుంటారు. అయితే బిందు మాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ అయినా.. మిత్రశర్మ టాప్ 5కీ వచ్చిన అది ఈ టీమ్ వల్లే అని వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ సందర్భంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నట్రాజ్ మాస్టర్ బిందుమాధవి పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
బిందు పేక్ ఓటింగ్ వేయించుకుందని, ఆమె కోసం పిఆర్ టీమ్స్ పనిచేస్తున్నాయని వాళ్లు ఫేక్ ఓటింగ్ ద్వారా బిందుకు ఓట్లు పడేటట్లు చేశారని ఆరోపించారు. దీనిపై బిందు స్పందిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న తప్ప ఎలాంటి టీమ్లను వాడుకో లేదని, అలాంటిది మాకు ఏమి అవసరం లేదని , ఏపీ,కర్ణాటక,తెలంగాణ, చెన్నై ప్రాంతాలనుంచి ఓట్లు పడడం వల్లనే విన్నర్ అయ్యానని తెలియజేసింది. నిజానికి పీఆర్ టీమ్స్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు అని అన్నది.
పూర్తి వివరాల్లోకి వెళితే ప్రతి సీజన్లో ఓటింగ్ లైన్స్ 5 రోజుల పాటు ఉంటారు. ఆదివారం రాత్రి నుండి శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ కి సంబంధించినటువంటి ఫేవరెట్స్ వాళ్లకి ఓట్లు అనేది వేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన టువంటి వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఓటింగ్ ప్రక్రియ ను ముందుగానే క్లోజ్ చేశారు. దీనికి ప్రధాన కారణం మిడ్ వీక్ ఎలిమినేషన్ అనే టాక్ కూడా వినపడింది.
ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు ఇంటి సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. కానీ ఈ సారి టాప్ సెవెన్ కంటెస్టెంట్స్ ను ఉంచారు బిగ్ బాస్. వారి యొక్క జర్నీ లు కూడా చూపిస్తూ వాళ్ళని కూడా ఫైనలిస్ట్ లని చేశారు. ఇందులో బాబా భాస్కర్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో సేవ్ అయ్యాడు. దీంతో ఫైనల్ కు ఏడుగురు కంటెస్టెంట్ వచ్చాడు. అయితే ఇందులో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇద్దరిని చేయవలసి వస్తుంది.
అందుకోసమే ఓట్స్ ప్రక్రియను బుధవారానికి క్లోజ్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇలా చేయడం వల్ల బిగ్బాస్ పార్టిసిపెంట్స్ ఎవరిని ఎలిమినేషన్ చేసిన ప్రాబ్లం అనేది ఉండదు. అయితే ఓటీటీ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఓటింగ్ ప్రకారం చూస్తే మాత్రం బాబా భాస్కర్ మరియు అనిల్ రాథోడ్ ఇద్దరు కూడా ఇద్దరూ లిస్టు లోనే ఉన్నారని, బహుశా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా వీరిని ఎలిమినేట్ చేస్తే మాత్రం, ఇక మిగిలినటువంటి వారిని టాప్ 5 పినాలిలో ఎలిమినేషన్ చేయవచ్చు.



