Trivikram Srinivas: డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతన్ని మాటల మాంత్రికుడు అని పిలుస్తారు. త్రివిక్రమ్ తాజాగా బీఎండబ్ల్యూ కారును కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఆయనకి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్ మూవీస్ లో కామెడీ డైలాగులకు లోటు ఉండదు. ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీ సీన్స్ ను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ తరువాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది.ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఇక ఈ లగ్జరీ కారు ఖరీదు రూ. 1.34 కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ గ్యారేజీలో లగ్జరీ కార్లు ఉన్నాకూడా, తాజాగా కొత్త కారును కొన్నారు. త్రివిక్రమ్ బీఎండబ్ల్యూ కారు కొంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న కారు రంగును చూస్తే, BMW 7 సిరీస్ 740 లీటర్ మోడల్ కారుగా అంచనా వేయబడింది. కారు ఖరీదు విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ బీఎండబ్ల్యూ కారును తన భార్యకు బహుమతిగా ఇచ్చారని సమాచారం. డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య సౌజన్య మంచి క్లాసికల్ డ్యాన్సర్. ఆమె ఇప్పటికే చాలా వేదికలపై తన నృత్య ప్రదర్శన చేసారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పూర్తి అయిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్, మహేష్ SSMB28 సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.