టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా దసరాకు వచ్చి భారీ విజయం సాధించిన 130 కోట్లు కలెక్షన్స్ కూడా సాధించింది. ఇప్పటివరకు తనకు సక్సెస్ ఇచ్చిన కామెడీ జోనర్ ని కొంచెం పక్కన పెట్టి బాలకృష్ణతో ఎమోషనల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చి భారీ హిట్ సాధించాడు.భగవంత్ కేసరి దసరా విన్నర్ గా నిలిచారు.
అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ డైరెక్టర్ బాబి తో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.సితార ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మాత నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో నటించిన శ్రీలీల కూడా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఏంటి అనేది మాత్రం ప్రశ్నగా మారింది. ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయని చెప్పాడు.
అయితే అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా రవితేజ తో ఉండొచ్చని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. రవితేజతో ఆల్రెడీ అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ సినిమా తీసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం రవితేజ ఈగల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది సంక్రాంతికి రాబోతుంది. ఏది ఏమైనా టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ ఎరగని దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలబడ్డారు. ఇప్పుడు అనిల్ రావిపూడి తో సినిమాలు చేసేందుకు ప్రతి స్టార్ హీరో సైతం ఓకే అంటున్నాడు.
అనిల్ రావిపూడి తో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అయితే అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో కూడా ఒక సినిమా తీస్తారని టాక్ అయితే వినబడుతుంది కానీ దానిపైన ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అనిల్ రావిపూడి తొందర లోనే తన నెక్స్ట్ సినిమాను ప్రకటిస్తారేమో చూడాలి.
Also Read:మళ్లీ వాయిదా పడ్డ వైష్ణవ్ తేజ్ సినిమా… క్రికెట్ ఏ కారణమా…!