Tollywood: మెగాస్టార్ చిరంజీవి‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుండి మొదటి పాటగా ‘బాస్ పార్టీ’ని విడుదల చేశారు. మెగాస్టార్ ఈ పాటలో తన డాన్స్ తో దుమ్ములేపారు. సహజంగానే మెగాస్టార్ చిరంజీవి, దేవిశ్రీ ప్రసాద్ కలయిక అంటే మోత మోగిపోవడం ఖాయం అని తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన శంకర్‌దాదా ఎంబీబీఎస్,శంకర్‌దాదా జిందాబాద్ పాటలో ఇప్పటికీ ఫేవరేట్. మెగాస్టార్ సెకెండ్ ఇన్నింగ్స్ లో వచ్చిన మొదటి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’కు దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందించారు. చాలా గ్యాప్ తరవాత వీరిద్దరి కలయికతో మరో మాస్ పాట వచ్చింది.
మెగాస్టార్ నుంచి చాలా కాలం తరవాత అదిరిపోయే మాస్ సాంగ్ వచ్చిందంటున్నారు ఫ్యాన్స్.ఇక మెగాస్టార్ చిరంజీవి అంటేనే అందరికీ ముందుగా గుర్తుచ్చేది డాన్స్. చిరంజీవి స్టెప్పులేస్తుంటే థియేటర్లలో జనాలు లేచి ఆడాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మెగాస్టార్ నుండి అలాంటి పెర్ఫార్మెన్స్ రాలేదనే చెప్పాలి. ఆ లోటు తీర్చడానికి అన్నట్టుగా ‘బాస్ పార్టీ’ మంచి మాస్ బీట్ సాంగ్‌తో వచ్చారు చిరంజీవి. ఆయన నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’మూవీలో ‘బాస్ పార్టీ’ అంటూ అదిరిపోయే మాస్ స్టెప్పులు వేసారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ నిన్న విడుదలైంది. ఈ పాటకు సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. ఈ పాటను నకాష్ అజీజ్, హరిప్రియతో కలిసి దేవి పాడారు.
ఇటీవలే విడుదలైన ‘బాస్ పార్టీ’ పాట ప్రోమో ఆసక్తిని పెంచింది. అయితే పాట కోసం వేసిన సెట్స్, చిరంజీవి వేసుకున్న కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా నిలిచాయి. ఫుల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. మెగా ఫ్యాన్స్ ఈ పాటను చూసి బాస్ దుమ్ములేపేశాడు అని సంబరాలు కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ పాటలో మరో ఆకర్షణ ఊర్వశి రౌతెలా. ఈ బాలీవుడ్ హీరోయిన్ మొదటిసారి తెలుగులో ప్రత్యేక గీతం చేసింది.. మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసింది. ఈ మాస్ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.