మొత్తం ఐపీఎల్ సీజన్ లో వారి అద్భుతమైన ఆటతీరుతో రాణిస్తున్న యువ బౌలర్లు ఎవరో తెలుసుకుందాం..!!
వైభవ్ ఆరోరా : ఈయన ఐపీఎల్ లో కి ముందుగా సీఎస్ కే టీమ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన తో వర్ధమాన ఫాస్ట్‌బౌలర్ లో వైభవ్ ఒకరు. ఈయన స్థిరమైన లైన్ మరియు లింకులలో బౌలింగ్ చేస్తాడు. బంతిని చాలా బాగా స్వింగ్ మరియు స్లిమ్ చేయడం తెలిసిన బౌలర్. ఐదు మ్యాచ్ల్ ల్లో మూడు వికెట్లు తీశాడు.
మొహ్సిన్ ఖాన్ : ముంబై ఇండియన్స్ వ్యతిరేకంగా LSG ఆటగాడు మొక్సిన్ ఖాన్. ఎడమచేతి బౌలర్. పోలార్డ్ మరియు సూర్యకుమార్ యాదవ్ వంటి వారిపై బౌలింగ్ చేసి భయపెట్టాడు. రెండు మ్యాచ్‌లు ఆడి ఒక వికెట్ తీశాడు.
యస్ దయాల్ :GT ప్లేయర్. లెఫ్ట్ అర్ము ఆటగాడు ఐపీఎల్లో ఆర్ ఆర్ ఆర్ పై అరంగేట్రం చేసి మూడు వికెట్లు తీసి అందరినీ ఆకట్టుకున్నాడు. దయాల్ బంతిని రెండు రకాలుగా స్వింగ్ చేయగలడు.
కుల్దీప్ సేన్ :RR ఆటగాడు. GT ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను ఆడలేని బంతితో అవుట్ చేయడంతో అందరి దృష్టి అతనిపై పడింది. లంకి పెసరు. చాలా వేగంగా బౌలింగ్ చేయగలడు. ఆర్ ఆర్ ను విజయ తీరాల వైపు నడిపే బౌలర్ అని చెప్పవచ్చు.
ముఖేష్ చౌదరి: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో సిఎస్ కే పేసర్ ముఖేష్ చౌదరి సంచలనం సృష్టించారు. ఎడమ చేతి వాటం ఉన్న పెసరు. బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేయగలడు.