ఇండస్ట్రీలో నట వారసులు రావడం చాలా కామన్. ఇదే ఈ కోవకు చెందిన ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కొడుకు కూడా చేరిపోయాడు..
తన విలక్షణమైన నటనతో ఎంతోమంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటుడు.
ఈయన పుత్రుడు సంజయ్ రావు “ఓ పిట్ట కథ” అనే మూవీ ద్వారా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. దీంతో సంజయ్ అంతగా ప్రేక్షకులను దగ్గర కాలేకపోయాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అప్పటినుండి సంజయ్ ఏ సినిమాలో రాలేదు. అయితే తాజాగా తన తదుపరి సినిమాకు సంబంధించి అప్డేట్ రిలీజ్ అయింది.
అయితే ఈ సినిమా మోషన్ పోస్టర్ ను స్టార్ హీరో రానా ఆవిష్కరించారు సంజయ్ రావు బర్త్ డే సందర్భంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్ తెలిపారు. మరి అది ఏంటో ఒక సారి చూద్దాం..?” స్లమ్ డాగ్ హస్బండ్” అనే సరికొత్త కాన్సెప్టుతో ఈ సినిమా వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కొన్ని వివాహాల్లో పాటిస్తున్నటువంటి మూఢనమ్మకాలకు సంబంధించిన విషయాలను వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపెట్టబోతున్నాడు దర్శకుడు. ” ఎవడ్రా నా కుక్క మీద రంగు పోసింది అంటూ అర్జున్ రెడ్డి మూవీ డైలాగ్స్ పేరడిని చేయడం వంటివి ఈ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి.
అలాగే మిమ్మల్ని పెళ్లికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం అంటూ మోషన్ పోస్టర్ ను ముగించారు. అయితే ఈ సినిమాను పూరి జగన్నాథ్ శిష్యుడు ఏ ఆర్ శ్రీధర్ తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్నారు. మైక్ మూవీస్ బ్యానర్ పై వెంకట్ అన్నపురెడ్డి, అక్కిరెడ్డి నిర్మిస్తున్నారు.