ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బంపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్. ప్రస్తుతం కొద్దిగా రిలాక్స్ అవుతున్నారు. ఆ సినిమా కోసం మూడు సంవత్సరాల పాటు అంకితం అయిపోయి చివరికి తన నటనతో అదుర్స్ అనిపించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ తరుణంలో తన 30 వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో మొదలు పెట్టబోతున్నారు. మరోవైపు ఉప్పెన సినిమా బుచ్చిబాబు ఒక స్పోర్ట్స్ కథను రాసుకుని అది ఎన్టీఆర్ తోనే తియ్యాలని పట్టుదలతో ఉన్నాడట. ఆ సినిమాకు “పెద్ది” అనే ఒక ఆసక్తికరమైన టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఉప్పెన మూవీ తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చినా వాటన్నిటినీ పక్కనబెట్టి తదుపరి సినిమాను ఎన్టీఆర్ తోనే తీయాలని బుచ్చిబాబు ఫిక్స్ అయిపోయాడు.
1980లో జరిగినటువంటి కథగా పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ కథాంశం ఉండబోతోంది. ఈ కథ అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చాలా ఇష్టమట. సినిమా చేయడానికి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ కథలో ఒక రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉన్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కథ యొక్క డిమాండ్ ను బట్టి కొన్ని సీన్స్ లో హీరో దివ్యాంగుడిగా కనిపించాలి. అయితే ఈ పాత్ర ఎన్టీఆర్ ఇమేజ్ కు సూట్ అవుతుందా లేదా అని అందరిలో మెదులుతున్న సందేహం. ఈ డౌటు ఎన్టీఆర్ కూడా వచ్చిందని సమాచారం. కానీ కథలో ఆ సీన్ చాలా కీలకం. దానిని తీసివేయడానికి లేదు. అయితే ఆ సీన్స్ చేస్తే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అని ఆలోచన పట్టిపీడిస్తోంది అని సినీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అలా అని కూడా ఈ కథను వదులుకోవడానికి ఇష్టపడటం లేదని, అందుకే ఈ మూవీ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. అయితే ఉప్పెన ఈ సినిమాలో కూడా ఇలాంటి ఒక రిస్క్ ఎలిమెంట్ ఉంది. దీని క్లైమాక్స్ ను మార్చమని బుచ్చిబాబుకు చాలామంది ఒత్తిడి తెచ్చారట.
కానీ బుచ్చిబాబు దీనికి ససేమీరా అన్నారని, సినిమాను కూడా క్లైమాక్స్ తోనే విడుదల చేశారు. దీంతో ఆ మూవీ సూపర్ హిట్ అయింది. అయితే ఆ మూవీకి, ఈ మూవీ కి తేడా ఏంటంటే.. హీరో వైష్ణవ్ తేజ్ కు అది మొదటి సినిమా. దానివల్ల అతనికి ఎలాంటి ఇమేజ్ లేదు కాబట్టి వర్కౌట్ అయింది. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలా కాదు.. టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరో, ఇలాంటి హీరోని దివ్యాంగుడు గా చూపిస్తే అభిమానుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందనే సందేహాలు అందరిలో ఉన్నాయట, బుచ్చిబాబు ఈ విషయంలో చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడని, ఎన్టీఆర్ ను కూడా కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇలాంటి పాత్ర చేస్తే పెద్ద రిస్క్ వస్తుందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి చివరకు తన ఇమేజ్ గురించి చూస్తాడా.. లేక పాత్ర గురించి ఆలోచిస్తాడో వేచి చూడాలి.