ఒకవైపు ఆర్.ఆర్.ఆర్ ఫీవర్ తగ్గక ముందే మళ్లీ అదే రేంజ్ లో వచ్చిన మూవీ కే జి ఎఫ్ 2 ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.
ఈ మూవీస్ ముందు మిగతా సినిమాలు కొట్టుకుపోయాయని చెప్పవచ్చు. భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.
ఈ రెండు సినిమాల డైరెక్టర్స్ చాలా ప్రతిభ కలిగి ఇండియన్ సినిమాల్లో వారి యొక్క టాలెంటును నిరూపించుకున్న వారే. మరి ఈ రెండు సినిమాల్లో ఏది బెస్ట్..ఏ చిత్రం టాప్ స్కోర్ ను సొంతం చేసుకున్నది..? ఏ మూవీ ప్రేక్షకుల మనసు దోచేసింది. అంటే సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. దేని స్థాయి దానిదే కానీ సినిమా సినిమాకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆర్ఆర్ఆర్ మూవీ పాన్ ఇండియా సినిమా కానీ ఇది టాలీవుడ్ చిత్రమే.
ఈ మూవీ కోసం దాదాపుగా 400 కోట్ల వరకు బడ్జెట్ అయిందని తెలుస్తోంది.కానీ కే జి ఎఫ్ చాప్టర్ 2 నిర్మాణానికి మాత్రం 100 కోట్లు ఖర్చు అయ్యిందని తెలుస్తోంది. అంటే దీన్ని బట్టి చూస్తే కే జి ఎఫ్ మూవీ కంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ చాలా ఇంపాక్ట్ చూపాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దానికి భిన్నంగా కనబడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డు స్థాయిలో వసూలు చేసినప్పటికీ, కే జి ఎఫ్ 2 ముందు తేలిపోయిందని అంటున్నారు.
దానికి గల కారణాలు ఇవే అని చెబుతున్నారు. కేజిఎఫ్ సీక్వెల్ మూవీ తో పోలిస్తే ఆర్ఆర్ఆర్ మూవీ కథ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంటే కే జి ఎఫ్ సినిమానే పైచేయిగా ఉన్నదని సమాచారం. డైలాగ్ విషయానికొస్తే కే జి ఎఫ్ మూవీకి ఆర్ ఆర్ ఆర్ సినిమాకి చాలా తేడా ఉందని డైలాగుల విషయంలో ప్రేక్షకులను కేజిఎఫ్ చాలా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఇలాంటి డైలాగులు ఆర్ ఆర్ ఆర్ కనీసం వినబడలేదు అని చెప్పవచ్చు.
ఈ రెండు సినిమాలు తీసిన దర్శకులు ఇద్దరు మంచి ప్రతిభ కలిగిన వీరులే. ఒకరిని మరొకరితో పోల్చలేము. ఎవరికి వారే సాటి. ఇందులో దర్శకుడు రాజమౌళి మాత్రం టేకింగ్ పై పెట్టిన దృష్టి డైలాగులపై పెద్దగా చూపడం లేదనే చెప్పాలి. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ప్రజల్లోకి చొచ్చుకుపోయే డైలాగులతో ప్రతి సినిమాకు ఒక ప్రత్యేక హోదాను కల్పిస్తున్నారు.