అల్లు అర్జున్. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఈయన కూడా ఒకరు. తన స్టైల్ తో ఇప్పటికే ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని స్టైలిష్ స్టార్ గా పేరు పొందారు.
అల్లు అర్జున్ సినిమా కోసం ఫ్యాన్స్ కూడా కళ్లల్లో వత్తులు వేసుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన స్టైలిష్ స్టార్ అల వైకుంఠపురంలో సినిమాతో మనల్ని ఏ విధంగా మెప్పించారో అందరికీ తెలిసిందే.
ఆ సినిమాలో ఆయన నటన నుంచి మొదలు పాటలతో దుమ్ము రేపారు. అల వైకుంఠపురంలో సినిమాలో ఇంట్లో తలెత్తినటువంటి సమస్యలను ఇంటికి దగ్గరగా ఉండి లేనట్లు ఉన్న వ్యక్తి ఏ విధంగా తీరుస్తారనే పాయింట్ లో త్రివిక్రమ్ ఈ సినిమాలో చూపించారు. అయితే ఈ మూవీలో స్టైలిష్ స్టార్ సరసన పూజా హెగ్డే మరియు నివేద కథానాయికలుగా నటించారు.
వారి హాట్ హాట్ అందాలతో ఎంతోమంది అభిమానులను మైమరపించారు. ఈ మూవీలో అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే ల కాంబినేషన్ తెరపై ఏ విధంగా ఉందో మీరు చూసే ఉంటారు. ఇక వారి పాటల విషయానికి వస్తే “బుట్ట బొమ్మ” అనే సాంగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఈ సాంగును సింగర్ అమ్రాన్ మాలిక్ ఆలపించగా, ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ పాటను రాసింది రామ జోగయ్య శాస్త్రి. ఈ మూవీ ఫుల్ వీడియో సాంగ్ 21 ఫిబ్రవరి 2020 లో విడుదలైంది.
ఆ సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేసింది. ఏ నోట విన్నా బుట్ట బొమ్మ అనే సాంగ్ వినిపించింది అంటే సాంగ్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సాంగ్ ను సింహళలో రీమేక్ చేసి వారి పర్ఫామెన్స్ అదరగొట్టారు. దీంతో ఇది మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సాంగ్ మరపురాని ఒక అద్భుతం అని చెప్పవచ్చు.