పీటల మీద దాకా వచ్చిన పెళ్లి పెటాకుల అయింది అన్నమాట మనం వినే ఉంటాం. అంటే పెళ్లి జరిగే ముందు పెళ్లి ఏదో కారణం చేత ఆగిపోతే ఈ మాటను వాడుతుంటారు. అదే పెళ్లి కొడుకు ద్వారానే ఆగిపోతే. వినటానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ… అయితే మీరు ఈ ఫుల్ స్టోరీని చదవాల్సిందే. ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ 9 ప్రకారం…
విశాఖ నగరానికి చెందిన యువతితో, గోపాలపట్నం ప్రాంతానికి చెందిన యువకుడికి పెద్దల సమక్షంలో వివాహం కుదిరింది. నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు ముహూర్తం పెట్టుకున్నారు. క్రిస్టియన్ పద్ధతిలో వివాహం జరపాలని నిర్ణయించారు. ఆమేరకు ఏర్పాట్లు చేశారు. పెళ్లి వస్త్రాలు ధరించి వధువు, వరుడితో పాటు ఇరు కుటుంబాల బంధువులు మండపం వద్దకు చేరుకున్నారు.
పెళ్లి క్రతువు ప్రారంభం అయింది. మరో పది నిమిషాల్లో పెళ్లి క్రతువు ప్రారంభం కావాలి. పెళ్లి వద్దని వరుడు పాస్టర్కు చెప్పాడు. ఆ విషయం తెలిసి వధువు తరపు వారంతా ఆగ్రహించారు. భయపడ్డ వరుడు బాత్ రూం కు వెళ్లి దాక్కున్నాడు. అక్కడ నుంచే డయల్ 100కు ఫోన్ చేసి తన బాధను పోలీసులకు చెప్పాడు. వెంటనే పోలీసులు కళ్యాణ మండపం చేరుకుని ఇరు వర్గాల పెద్దలతో చర్చించారు.
అసలు వరుడు పెళ్లి ఎందుకు వద్దంటున్నాడు అన్న విషయం పైన పోలీసులు ఆరా తీయగా పెళ్లికి నెల రోజు నువ్వు ముందు నుండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. అయితే పెళ్లి పనులు నేపథ్యంలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకి ఫోన్ చేయగా రెండుసార్లు ఫోన్ తీయలేదు. అప్పట్నుండి మనసులో పెట్టుకున్న పెళ్ళికొడుకు సరిగ్గా మాట్లాడటం మానేశాడు. సరిగ్గా పెళ్లి పీటల మీదకు వచ్చేసరికి పెళ్లి ఆపేసాడు.
పోలీసులు పెళ్ళికొడుకుని నచ్చచెప్పే ప్రయత్నం చేయగా ఈసారి పెళ్లికూతురు అడ్డం తిరిగింది. అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోకుండాపెళ్ళికి ముందే ఫోన్ మాట్లాడటం లేదని పెళ్లి ఆపేసిన వ్యక్తిని తాను పెళ్లి చేసుకొని చెప్పింది. అయితే ఒక్కసారిగా పెళ్లి ఆగిపోవడంతో పెళ్లికూతురు తండ్రి రోదన చూసి అక్కడ ఉన్న వారంతా కన్నీరు పెట్టుకోకుండా ఉండలేకపోయారు.
Also Read:హిందూ ధర్మాన్ని అవమానించారా..? అసలు అంతగా ఏం ఉంది ఇందులో..?