ప్రతి ఒక్క మహిళ తన భర్త తనను మహారాణిలా చూసుకోవాలని కోరుకుంటుంది. తనని ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమించాలని కలలు కంటుంది. ఇలా తన భార్యను ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవడం వల్ల వారి యొక్క శృంగార జీవితం కూడా చాలా సంతృప్తిగా ఉంటుంది. కానీ కొంతమంది పురుషులు మాత్రమే వారి భార్యలను అలా చూసుకుంటారు. మరి వారు ఎవరు.. ఏ రాశులకు చెందిన వారు.. అలాంటి రాశుల వారి గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో చూద్దాం..?
వృషభం:
వృషభ రాశి పురుషులు చాలా రొమాంటిక్ గా ఉంటారు. చాలా ఉద్వేగభరితమైన వ్యక్తిత్వానికి ప్రసిద్ధి. వీరు స్త్రీని ప్రేమిస్తే వారి కోసం ఏదైనా చేస్తారు. వీరు ఎప్పుడు వారి జీవిత భాగస్వామి ప్రేమను పొందుతుందా.. జాగ్రత్తగా చూసుకుంటున్నానా అనే విషయాలను గమనిస్తూనే ఉంటారట. రాశి వారు విధేయతకు ప్రసిద్ధి. ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మాత్రం ఇక వారిని వదులుకోవటం కష్టమే.
కర్కాటక రాశి :
ఈ రాశికి చెందిన పురుషులు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అలాగే ఎమోషనల్ కూడా ఎక్కువ అవుతారు. ఆప్యాయత అనేది ఒక వ్యక్తిని ఎంత దగ్గర చేస్తుందో.. ప్రేమించేలా చేస్తుందో వీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. అందుకే వీళ్లు మొదటి ప్రాధాన్యత తమ భాగస్వామికి విలువ ఇవ్వడమే కాకుండా వారిని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తూ ఉంటారు.
మకర రాశి :
ఈ రాశివారు వారి జీవిత భాగస్వామిని ఇతరులకు చూపించడంలో గర్వంగా ఫీల్ అవుతారు. వీరు ఎంత బాగా చూసుకుంటారు అంటే.. వారు అందించే ప్రేమ సంరక్షణతో వారి జీవిత భాగస్వామి మహారాణిలా భావిస్తారు. రాశి వారు జీవిత భాగస్వామి పట్ల అంకిత భావం కలిగి ఉంటారు. ఈ రాశివారు ఒక్కసారి ఫిక్స్ అయితే వారి మాట వారే వినరు. వారి భాగస్వామిని ఎప్పుడు అంటి పెట్టుకొని ఉంటారు.
మీన రాశి :
వీరి యొక్క ప్రేమలో చాలా ఫ్యాషన్ ఉంటుంది. వారి భార్యను రాణిలా చూసుకోవడంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు. వీరికి కావాల్సింది అద్భుతమైన, అందమైన, శాశ్వతమైన ప్రేమ. అదే లక్ష్యంగా వీరు పని చేస్తూ ఉంటారు. తాము ఎవరిని ఇష్టపడుతూ ఉన్నాం. ఎవరికి ఎక్కువగా కమిట్ అవుతున్నాం.. అనే విషయాలను చాలా జాగ్రత్తగా గమనిస్తారు. ఈ రాశివారు స్త్రీలకు ఎక్కువగా చాక్లెట్లు, పువ్వులు ఇతర బహుమతులు ఇస్తూ సర్ ప్రైజ్ చేస్తూ ఉంటారు.