ఇండియన్ క్రికెట్ లోనే స్టార్ ప్లేయర్ల లిస్టులో విరాట్ కోహ్లీ ఒకరని చెప్పవచ్చు. అయితే మన దేశంలో సెలబ్రిటీ స్టార్డం ఉన్నవారు మాత్రం రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇలా వారు ఆస్తులను కూడబెడుతూ విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు.
ముఖ్యంగా సినిమాల్లో గాని, క్రికెట్ లో గాని రాణించే వారు పలురకాలుగా ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇండియాలోనే మోస్ట్ రిచ్చెస్ట్ సెలబ్రిటీలుగా పేరు పొందిన విరాట్ కోహ్లీ మరియు అనుష్క దంపతులు.
మరి వీరు ఎక్కువ పెట్టుబడులు ఎందులో పెట్టి ఎంత సంపాదించారో ఓ సారి చూద్దాం..? అనుష్క శర్మ సినిమా రంగంలో హీరోయిన్ గా చేస్తూ స్టార్ అయింది.విరాట్ కోహ్లీ విషయానికి వస్తే భారత్ క్రికెట్ ప్లేయర్ నుంచి కెప్టెన్ వరకు ఎదిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ఒక యాడ్ లో నటించడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో లవ్ బర్డ్స్ గా ఉన్న వీరు వివాహం చేసుకొని చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పవచ్చు.
వీరిద్దరూ సొంతంగా సంపాదించుకున్న సంపాదనతోనే ఇండియాలోనే రిచ్చెస్ట్ గా పేరును సంపాదించుకున్నారు. వీరి ఆస్తుల వివరాలు చూస్తే మనకు కళ్లు చెదిరిపోతాయి. వీరిద్దరి ఆస్తులు కలిపి కొన్ని వందల కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ భారత్ లో స్టార్ క్రికెటర్ కావడం వల్ల ఆయన ఆడే మ్యాచ్ ఫీజులు మరియు ఎండోమెంట్ వంటి ఒప్పందాలు, రాబడులు చూస్తుంటే ఒక సంవత్సరంలో వంద కోట్లకు పైగా సంపాదిస్తారు అని సమాచారం.
ఇక అనుష్క శర్మ విషయానికి వస్తే ఆమె హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. అలాగే అనుష్క శర్మ కొన్ని రకాల వస్త్రాల బిజినెస్ కూడా చేస్తోందని దీని విలువ దాదాపు 65 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. గురువారు గుళ్లోని విరాట్ సొంత బంగ్లా 80 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
అలాగే వీరిద్దరి కార్ల విలువ 25 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ముంబై నగరంలో పది కోట్ల విలువ చేసే ఒక అపార్ట్మెంట్. అలాగే ఖరీదైన వస్తువులు బైకులు ఉన్నాయి. ఇదే కాకుండా వీరు పలు పరిశ్రమ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ఇక విరాట్ కోహ్లీ పూర్తి ఆస్తుల వివరాలు చూస్తే దాదాపుగా 950 కోట్ల పైగానే ఉంటుందని అంచనా. ఇక అనుష్క శర్మ ఆస్తుల విషయానికి వస్తే 450 కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే వీరి ఆస్తుల విలువ దాదాపు 1400 కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది.