Cm Jagan: జగన్ అక్రమ ఆస్తుల కేసు మరోసారి వాయిదా వేసిన కోర్ట్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అక్రమ ఆస్తుల కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ కేసు. తాజాగా మరో సారి వాయిదా వేసింది సిబిఐ కోర్ట్. హైదరాబాద్ లోని సిబిఐ కోర్ట్ లో ఇవాళ వాదనలు విన్న తరువాత .. ఇప్పటికే పలుమార్లు సీఎం జగన్, రఘురామకృష్ణ రాజు తమ వాదనలు కోర్టుకి వినిపించగా.
లిఖితపూర్వకంగా సిబిఐ కూడా వాదనలు సమర్పిస్తామని చెప్పింది.సిబిఐ తీరుపైన అభ్యంతరాలు తెలిపిన రఘురామా కృష్ణ రాజు తరపున న్యాయవాది తన వైఖరిని మారుస్తూ సమయాన్ని, కాలాన్ని వృథా చేస్తుందంటూ ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కేసు మరింత సమయాన్ని కోరగా ఈ నెల 30 న మరోమారు విచారణకు రానుంది.ఈ నెల 14 న విచారణ జరిగిన సంగతి తెలిసిందే. పది రోజులు గడువు కోరగా తిరిగి ఈరోజు విచారణ చేపట్టింది.