గతంలో రజనీకాంత్ హీరోగా జ్యోతిక, నయనతార హీరోయిన్లుగా వచ్చిన చిత్రం చంద్రముఖి. ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. హర్రర్ జొనర్ లో వచ్చిన చిత్రం ప్రతి ఒక్కరిని భయపెట్టింది. జ్యోతిక నటనక అయితే హాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. చంద్రముఖిగా తన అభినయం అదర్ హో అనంతగా ఉంటుంది. తెలుగులో డబ్బింగ్ అయినా ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
వడివేలు కామెడీ విచిత్రానికి ఒక హైలెట్ గా నిలిచింది. చంద్రముఖి సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పటికీ ఇండియన్ సినిమాలో వచ్చిన హర్రర్ జోనర్లలో చంద్రముఖి అనేది ఒక బ్రాండ్. చాలా భాషల్లో ఈ చిత్రం రీమేక్ కూడా అయింది. పి వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
అయితే తాజాగా చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా రాఘవ లారెన్స్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా,పి.వాసు దర్శకత్వంలో చంద్రముఖి 2 సినిమాని తెరకెక్కించారు. ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించారు. అయితే ఈ చిత్రం తాజాగా విడుదలయ్యింది. మొదటి రోజు నుండి ఈ చిత్రం డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎక్కడ కూడా చంద్రముఖి కి తగ్గ రీతిలో ఈ చిత్రం నిలబడలేదు. అయితే కంటెంట్ పరంగా విమర్శలు అందుకున్న ఈ చిత్రం కొన్ని ఓవర్ యాక్షన్ సీన్లతో కూడా ప్రేక్షకుల ట్రోల్స్ కి గురి అయింది.
కీరవాణి సంగీతంలో ఒక్క పాట కూడా అలరించదు.ఈ సినిమాలో కొన్ని సీన్లు అయితే మరీ కామెడీగా తీసేశారు.సినిమాలో హీరో రాఘవ లారెన్స్ పిల్లల్ని కాపాడే సీన్ లో ఫైటింగ్ చేస్తున్నప్పుడు బండి గాల్లో ఎగిరి పిల్లలు రాఘవ లారెన్స్ లో ఒడిలోకి రావడం అనేది చూసేందుకు ఎంత కామెడీగా ఉందో. మరో సీన్ లో హీరో ఒక అమ్మాయిని చెయ్యి పెట్టలేపితే గాల్లో ఎగిరి హీరో పక్కన వచ్చి నిలబడుతుంది.
ఈ రోజుల్లో కూడా కనీస స్థాయి ప్రేక్షకులను అలరించే సీన్స్ తీయాలని దర్శకుడుకి అనిపించకపోవడం విడ్డూరం.కొన్ని సినిమాల్లో బాగానే చేసే లారెన్స్ ఈ సినిమాలో ఓవర్ యాక్టింగ్ చేసినట్లుగా అనిపించింది. కంగనా రనౌత్ నటన జ్యోతిక నటన పక్కన నిలబడలేకపోయింది. అందుకేనేమో ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుని కనుమరుగైపోయింది.
watch video:
https://twitter.com/saichndra/status/1717427155062460600
ALSO READ : లియో మూవీలో విలన్ గా భయపెట్టిన ఈ అబ్బాయి ఎవరో తెలుసా ?