ప్రభాస్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి ఛత్రపతి. ఈ సినిమాతో ప్రభాస్ మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఛత్రపతి సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించగా బివిఎస్ఎన్ ప్రసాద్ గారు నిర్మించారు. 2005లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. ముఖ్యంగా భాను ప్రియ గారి పర్ఫామెన్స్, మరొక ముఖ్య పాత్రలో నటించిన షఫీ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ అయింది. chathrapathi child artist Bhaswanth vamsi
ఛత్రపతి సినిమాలో డైలాగ్స్ అయితే మనం ఇప్పటికీ కూడా ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి ఆ డైలాగ్స్. కీరవాణి గారు అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా కి మరొక మేజర్ హైలైట్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాలో అనితా చౌదరి కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు.
అనిత చౌదరి కొడుకు పాత్రలో నటించిన అబ్బాయి మీ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఆ సినిమాలో అతని పాత్ర పేరు సూరీడు. సూరీడు పాత్ర పోషించిన వ్యక్తి పేరు భాస్వంత్ వంశీ. సినిమాలో అనిత చౌదరి పాత్రకి ఇంకా సూరీడు పాత్రకి మధ్య వచ్చే సీన్ కథ ముందుకు వెళ్లడానికి ముఖ్య కారణంగా నిలిచింది.
ప్రస్తుతం వంశీ ఇలా ఉన్నారు. అయితే తేజ సజ్జ, నిత్య అలాగే ఇంకొంతమంది చైల్డ్ యాక్టర్స్ గా నటించిన వారు ఇప్పుడు హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. వారి లాగానే భాస్వంత్ వంశీ కూడా ఒక మంచి సినిమాతో మళ్ళీ మనందరినీ అలరించాలి అని ఆశిద్దాం.