దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో బాహుబలి ప్రభాస్ నటించిన ఛత్రపతి చిత్రం తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రభాస్ కి స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన సినిమా ఛత్రపతి.ఈ సినిమాలో శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో మాస్ ఎలివేషన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి పునకాలు తెప్పించాయి. ఎంఎం కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది.
అయితే ఈ సినిమాని చాలా సంవత్సరాల తర్వాత బాలీవుడ్ రీమెక్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రూపొందించిన కూడా ఇందులో నటించింది తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది తెలుగు దర్శకుడు వివి వినాయక్. పెన్ మూవీస్ బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మించారు.
భారీ అంచనాల నడుమ ఈ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ అయింది. బాలీవుడ్ లో కూడా ఛత్రపతి పేరుతోనే ఈ సినిమాని విడుదల చేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా బాలీవుడ్ లో డిజాస్టర్ గా మిగిలింది.అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఒక సీన్ ను ఇంటర్నెట్ లో బాగా ట్రోల్ చేస్తున్నారు. ఛత్రపతి లో పిల్లాడిని విలన్ కొట్టి దగ్గరికి ఎవరిని రానివ్వకుండా భయపెట్టే సందర్భంలో ప్రభాస్ ఒక్క అడుగు ముందుకేసి ఆ విలన్ ను కొట్టి చంపి పిల్లాడిని కాపాడతాడు. అదే సీన్ హిందీ చత్రపతి లో కూడా సేమ్ డిటో తీసేసారు. అయితే ఇప్పుడు ఆ సీన్ ఎవరు బాగా చేశారు అంటూ కంపేరిజన్ లు మొదలు పెడుతున్నారు.
ప్రభాస్ ఒక్క రేంజ్ లో చేస్తే బెల్లం బాబు మాత్రం అంచనాలని అందుకోలేదు అని ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు సినిమాల్లో యాక్ట్ చేసింది తెలుగు హీరోలే… ప్రభాస్ ని ఇక్కడ తెలుగు ఆడియోస్ కి తగ్గట్టు యాక్ట్ చేయిస్తే అక్కడ బెల్లంకొండ ని హిందీ ఆడియోస్ కి తగ్గట్టు యాక్ట్ చేయించారు.. హిందీ చత్రపతి ఫ్లాప్ అయిన కూడా బెల్లంకొండ శ్రీనివాస్ కష్టపడి ఆ సినిమాలో మంచి ప్రదర్శన కనబరిచాడు. ప్రభాస్ తో పోల్చకూడదు కానీ తన పరిధి మేరకు బాగా నటించాడు.
Watch Video:
Hey what is this man 😵😭#Chatrapathi #Chatrapathi4K #Prabhas pic.twitter.com/WSbi1IUm1b
— 𝙐𝙨𝙩𝙝𝙖𝙖𝙙🔥ᵖˢᵖᵏ𝙘𝙪𝙡𝙩🦅 (@USTHAAD_PK_CULT) November 21, 2023
ALSO READ : కోట బొమ్మాళి పిఎస్ మూవీ సెన్సార్ టాక్… హిట్ కొట్టేలా కనిపిస్తుంది..