పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే.. వారిని అనుసరించే పిల్లలు వారి అలవాట్లు నేర్చుకుంటారు. వారి వ్యక్తిత్వం కూడా వారి నుంచే వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు మంచి నడవడిక తోని ఉంటే పిల్లలకి కూడా అదే అలవాటు అవుతుంది.
దీని ద్వారా పిల్లలు కూడా సరైన మార్గంలో వారి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తిస్తారు. దీంతో తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వచ్చి గర్వపడేలా చేస్తారు.
కానీ కొంతమంది తల్లిదండ్రులు చేసే తప్పులే పిల్లల పాలిట శాపంగా మారతాయి.. మరి అవేంటో తెలుసుకుందామా..!తల్లి ఒకటైతే పిల్ల ఒకటి అవుతుందా.. తల్లి తీరు పిల్ల అంటారు పెద్దలు. ఆ విధంగానే తల్లిదండ్రుల స్వభావం ఏ విధంగా ఉంటుందో పిల్లలకు కూడా చిన్న నాటి నుంచి అదే అలవాటు అవుతుంది. ఆచార్య చాణిక్యుడు తల్లిదండ్రులు పిల్లలను సద్గుణాలతో పెంచాలని చెప్పారు.
అలా పెంచిన తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును కాపాడిన వారవుతారని, దీని ద్వారా పిల్లలు తల్లిదండ్రులకు కూడా పేరుప్రఖ్యాతులు తీసుకొస్తారని అన్నారు. ఎప్పుడూ కూడా పిల్లల మనసులో తప్పుడు ఆలోచనలు వచ్చేలా చేయవద్దని అంటున్నారు. మీ కోరికలు ఏవైనా ఉంటే పిల్లలపై పెట్టి ఒత్తిడి తీసుకు రాకూడదని, మీ సొంత ప్రయోజనాలు తీర్చుకోవడానికి పిల్లలతో అబద్ధాలు ఆడించ కూడదని చాణిక్యుడు తెలియజేశారు.
ఈరోజు మీరు ఆడించే అబద్ధం వారి భవిష్యత్తు పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి సత్ప్రవర్తనతో పిల్లలను పెంచితే సమాజంలో మీకు పిల్లలకు గౌరవం ఉంటుందని చాణిక్యుడు తెలియజేశారు. పిల్లల చదువు విషయంలో సీరియస్ గా తీసుకొని తల్లిదండ్రులు పిల్లలకు శత్రువు లాంటివారని అన్నారు.
అలాగే తల్లిదండ్రులు పిల్లలపై మితిమీరిన ప్రేమ ఆప్యాయత చూపించకూడదని, ఇలా చేయడం వల్ల పిల్లలు డేంజర్ జోన్లో పడతారని అన్నారు. ఈ విధంగా చేస్తే పిల్లలు ప్రతీది తన మనస్సుకు అనుగుణంగా అలవాటు చేసుకుంటారని, అలవాటే నిరంకుశంగా మారుతుందని తెలియజేశారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు తప్పనిసరిగా ఖండించాలని, తర్వాత తప్పొప్పుల మధ్య తేడాని తెలియజేయాలని ఆచార్య చాణిక్య తెలియజేశారు.
https://tv9telugu.com/spiritual/chanakya-niti-in-telugu-such-parents-are-like-enemies-for-children-according-to-acharya-chanakya-684465.html