ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు చాలా గమ్మత్తుగా సమాధానం ఇస్తూ నవ్విస్తూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన మరొక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.. అవేంటో ఒకసారి చూద్దాం..? ఈయన ఎప్పుడు పోస్టులు పెట్టిన అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అయితే భారత జట్టు ఇటీవల తమస్ కప్ గెలిచి బ్యాడ్మింటన్ లో చరిత్ర సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. చిరాగ్ శెట్టి – రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ డబుల్ జోడి టీం విజయంలో కీలకంగా వ్యవహరించారు. ఇలా చరిత్ర సృష్టించిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.. దీనికి చిరాగ్ శెట్టి స్పందిస్తూ.. ధన్యవాదాలు తెలియజేశాడు. అలాగే తను మహేంద్ర కంపెనీ కి చెందినటువంటి Suv 700 కార్ బుక్ చేశానని, కాస్త త్వరగా డెలివరీ చేయాలని అన్నాడు. దీనికి ఆనంద్ మహీంద్రా చాలా వెరైటీగా బదులిచ్చారు. ” ఛాంపియన్ లకు ఎంపికగా మారినటువంటి suv 700 ని వీలైనంత తొందరగా మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాము. నేను కూడా నా భార్య కోసం ఒకటి ఆర్డర్ చేశాను.అయినా ఇప్పటికి నేను క్యూ లోనే ఉన్నాను. అంటూ బదులిచ్చారు ఆనంద్ మహీంద్రా. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా చీఫ్ సెట్ల కొరత రావడంతో కార్ల తయారీ కంపెనీ ఇబ్బందులు పడుతున్నాయని, అందుకే కార్లు తయారు చేయడానికి కంపెనీలకు సమయం పడుతుందని అన్నారు. అనేక బుకింగ్ లు ఉన్న కార్లను డెలివరీ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేసారు ఆనంద్ మహీంద్రా.