మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం లో రూపొందుతున్న మలయాళ రీమేక్ సినిమా లూసిఫర్ ఈ సినిమాకి తెలుగు లో గాడ్ ఫాదర్ అనే టైటిల్ ని పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా లో నటిస్తున్నారు.
దాదాపుగా పూర్తి అయినా ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ‘లూసిఫర్’ చిత్రాన్ని షూటింగ్ ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇక మెగా స్టార్ కి మొదటి సారి థమన్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఈ సందర్బంగా ట్విట్టర్ లో చిరంజీవి, థమన్, మోహన్ రాజా ఉన్న ఫోటో ని షేర్ చేసారు. మెగా స్టార్ తన తదుపరి సినిమా ని మెహర్ రమేష్ తో, మరొక సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు బాబీ తో చేయనున్నారు.