తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల హడావిడి మొదలైంది. నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు జరగనున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే తెలంగాణలో ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిలో మొదటి జాబితా అభ్యర్థుల లిస్టులను ప్రకటించేసాయి. ఎవరికివారు తామే అధికారంలోకి వస్తామంటూ ప్రచారాలను వేడెక్కిస్తున్నారు.
అయితే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా లేదా అనేదానిపైన క్లారిటీ లేదు. ఒకపక్క టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండడం తెలంగాణ టిడిపి నాయకులకు దిశా దేశం చేసేవారు లేకపోవడం వల్ల సందిగ్ధం నెలకొంది.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడుతో ములక్కాత్ అయ్యే అవకాశముంది.ఈ భేటీలో చంద్రబాబు అభిప్రాయాన్ని బట్టి కార్యాచరణ ప్రకటిస్తామని కాసాని తెలియజేశారు. ఇప్పటివరకు ఉన్న పరిణామాలు బట్టి చూస్తే తెలంగాణలో టిడిపి పోటీ చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఒకవేళ టిడిపి పోటీ చేయకపోతే ఇది ఏ పార్టీకి మేలు చేస్తుందని దానిపైన రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అయితే సోషల్ మీడియాలో తెలంగాణలో టిడిపి పోటీ చేయడం లేదు అన్న ప్రచారం ఊపందుకుంది. దీనిపై టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెంటనే స్పందించారు. అది తప్పుడు ప్రచారం అని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 87 స్థానాల్లో పోటీకి రెడీ అయిందని, ఈ ఎన్నికలను టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందనిఅన్నారు.119 నియోజకవవర్గాలకు సబంధించిన అప్లికేషన్లు ఇప్పటికే తీసుకున్నామన్నారు.
అయితే తెలంగాణలో టిడిపి పోటీ చేయకూడదనేది బిజెపి అభిప్రాయం అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అనంతరం జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే ఇదే నిజమని అర్థమవుతుంది. తెలంగాణలో టిడిపి పోటీ చేస్తే కనుక ఓట్లు చీలి తమకి నష్టం జరుగుతుందని ఉద్దేశంలో బిజెపి ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో టిఆర్ఎస్ పార్టీ వైసీపీకి సపోర్ట్ చేస్తుందని ఉద్దేశంలో తెలంగాణలో టిడిపి ఓట్లు బిఆర్ఎస్ కి పడే అవకాశం లేదు. ఒకవేళ టిడిపి కనుక పోటీ చేయకపోతే ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి పడతాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read:చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్డేట్ ఇదే…