అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అనేది చెప్పడం చాలా కష్టం.. దీన్ని ప్రజలు రకరకాలుగా ఊహించుకుంటారు. కొన్ని సంఘటనల గురించి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని ఒక తరపు వర్గం వారు అంటుంటారు. మరి కొంతమందేమో అందులో ఏదో సైన్సు జన్యు లోపం ఉందని అంటుంటారు. ఇలా ఎవరి విషయాన్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అర్థం కాక మనం చాలా సంఘటనల్లో సందిగ్ధాన్ని వ్యక్తం చేస్తాం.. అలాంటి ఓ సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.. అది ఏంటో ఒక సారి చూద్దాం..?
కేరళ రాష్ట్రంలోని కన్నురు జిల్లాలో 11 నెలల దూడ పాలు ఇవ్వడం ప్రారంభించింది. ఆ దూడ రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది. ఇందులో విచిత్రం ఏముంది అంటారా.. అది ఒక్కసారి కూడా గర్భం దాల్చలేదు.. అయినా పాలు ఇస్తోంది.. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కలవారు ఆ దూడను చూడటానికి తండోప, తండాలుగా వస్తున్నారు. కన్నూరు జిల్లాకు చెందిన టువంటి సజేష్ అనే రైతుకు గొర్లు, ఆవుల పామ్ ఉంది. ఈయన 2021లో కొన్ని ఆవులు, దూడలను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అందులో ఒక ఆవుకు ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో దాన్ని అమ్మేశారు. దానికి పుట్టినటువంటి దూడను ఉంచుకున్నాడు.
అయితే ఆ దూడ పొదుగు ఉబ్బి ఉండటాన్ని ఒక మహిళ గమనించింది. ఈ విషయాన్ని వెంటనే సజేష్ కు చెప్పింది. అతను కూడా దాన్ని పరిశీలించి చూశారు. ఆ పోదుగు దగ్గర గట్టిగా ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఒక సమయంలో పాలను పితికి చూశారు. అందులో నుంచి పాలు ధారగా వచ్చాయి. పాలు బాగానే ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రతి రోజూ పాలు పిండడం మొదలుపెట్టాడు. పాలు కూడా చిక్కగా తాగడానికి అనువుగానే ఉన్నాయి.
మామూలు ఆవులు, గేదెల పాలు ఎలా ఉంటాయో ఆ విధంగానే ఉన్నాయి. దీంతో ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక్కసారి కూడా గర్భందాల్చని దూడ పాలు ఇవ్వడం అనేది వింతగా మారిపోయింది. ఇది గత 15 రోజుల నుంచి దాదాపు లీటర్ల కొద్దీ పాలిస్తుంది. దీంతో వెటర్నరీ డాక్టర్ అర్జున్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్నిరకాల జన్యుపరమైన కారణాలతో ఇలా జరుగుతుందని ఆయన అన్నారు. దీనిపై సైంటిస్టులు కూడా పరిశోధనలు చేస్తున్నారు అని తెలియజేశారు. ఈ ఆవు ఇస్తున్న పాలలో దాదాపు 8.8% కొవ్వు ఉన్నట్లు నిర్ధారించారు.