యుక్త వయసులో కుర్రాళ్ళు చేసే చిలిపి పనులకు అడ్డు అదుపు ఉండదు. వారు చేసే పనులు కాస్త ఇబ్బందికరంగా ఉన్నా…. ఒక్కోసారి భలే ముచ్చటగా అనిపిస్తాయి. టీనేజ్ లో ఉండగానే అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలి ప్రేమించాలి అని తహతహ పడుతూ ఉంటారు. కొందరైతే తాను ప్రేమించే అమ్మాయి కోసం పడరాని పాట్లు పడుతూ ఉంటారు.
పాటలు పాడుతూ అమ్మాయిల వెంట పడడం, బైక్స్ మీద స్టంట్ లు చేయడం, ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చి ఆకట్టుకోవడం ఇలా ఎవరికి నచ్చింది వారు చేసుకుంటూ పోతారు. కొందరి ప్రయత్నాలు ఫలిస్తాయి మరికొందరి ఫలించవు.ఇప్పుడు అలాంటి ఓ ప్రయత్నమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఒక అబ్బాయి తనకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక లవ్ లెటర్ రాసి ఇచ్చాడు. అమ్మాయిని అప్సర పెన్సిల్ తో పోలుస్తూ అదరగొట్టాడు. “మీరు పెన్సిలా ఏంటి దూరం నుంచి అప్సరలాగా కనిపిస్తున్నారు” అని రాసి చివర్లో ఒక స్మైల్ సింబల్ వేశాడు.
గురుడు టాలెంట్ కి అమ్మాయి ఇంప్రెస్ అయ్యి ఆశ్చర్యపోయింది. వెంటనే ఆ లెటర్ ను ట్విట్టర్ (x) లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కుర్రాడి టాలెంట్లకి నేటిజెన్లు ఇంప్రెస్ అయ్యారు. ఇంతకంటే బాగా ఎవరు ప్రపోజ్ చేస్తారు ఒప్పేసుకో అంటూ అమ్మాయికి కామెంట్లు పెట్టారు. మరికొందరైతే ఐడియా బాగుంది నేను కూడా ట్రై చేస్తా అని పెట్టారు. ఆ స్లిప్ ను లామినేషన్ చేసి ఉంచుకోండి జీవితాంతం మంచి జ్ఞాపకంగా ఉంటుందని మరొకరు పెట్టారు. ఇంతకీ ఆ అమ్మాయి గురుడు ప్రేమను ఒప్పుకుందో లేదో తెలియదు గాని, మనోడు టాలెంట్ మాత్రం ప్రపంచానికి తెలిసింది.