dakkshi guttikonda: జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు రాబోతున్నారు. జెమినీ టీవీ లో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం మొదలవబోతోంది.
అయితే, ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది. ఈ ప్రోమో లో ఒక అమ్మాయిని తన స్కూల్ టీచర్ “ఏమవుతావు?” అని అడుగుతారు. ఆ అమ్మాయి “అమ్మ అవుతాను” అని చెప్తుంది. తర్వాత ఆ అమ్మాయి పెద్దయ్యి ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం కంటెస్టెంట్ గా వస్తుంది.
అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ “మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు?” అని అడిగితే, “అమ్మ అవ్వాలి అనుకుంటున్నాను?” అని చెప్తుంది. అయితే ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇందులో నటించిన అమ్మాయి ఎవరు అని అందరూ సెర్చ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి పేరు దక్షి గుత్తికొండ.
దక్షి అంతకు ముందు సినిమాల్లో, షార్ట్ ఫిలిమ్స్ లో, వెబ్ సిరీస్ లో నటించారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కరోనా వైరస్ సినిమాలో కూడా నటించారు. దక్షి. అంతే కాకుండా ప్రముఖ డైరెక్టర్ శేఖర్ సూరి దర్శకత్వంలో వస్తున్న ఒక వెబ్ సిరీస్ లో, అలాగే కొత్త పోరడు డైరెక్టర్ అన్వేష్ మైకేల్ దర్శకత్వంలో వస్తున్న మరొక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు దక్షి.
watch video :
https://youtu.be/RGMDSXnLIK8