ప్రపంచకప్ ఆడిన ఇంగ్లాండ్ దేశం మహిళా ప్లేయర్స్ లో డానియెల్ వ్యాట్ ఒకరు. ఈమె గురించి క్రికెట్ అభిమానులకు ఎక్కువగా తెలియకపోవచ్చు. అయితే సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో వ్యాట్ ఒక్కసారిగా క్రికెట్ లో స్టార్ గా మారిపోయి విపరీతంగా వైరల్ అయింది.
గత నెల రోజుల నుంచి న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్నటువంటి మహిళల వన్డే ప్రపంచ కప్ గురించి అందరికీ తెలిసిందే. ఈ యొక్క మ్యాచ్ ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టుతో ఇంగ్లాండ్ తుది వరకు పోరాడి ఓడింది. అయితే ఇంగ్లాండ్ తరపున ఆడే ఫైనల్ మ్యాచ్ లో స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ వీరాభిమాని ఆడనున్నారు. ఆమె అభిమాని అంటే మామూలు అభిమాని కాదు నెక్స్ట్ లెవెల్ అంతే అని చెప్పవచ్చు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ సెమీ ఫైనల్లో వ్యాట్ ఒక్కసారిగా తలుక్కుమన్నారు.
దీంతో ఆమె గతంలో చేసినటువంటి ఒక ట్విట్ వైరల్ గా మారింది 2014 సంవత్సరంలో వ్యాట్ ఇంగ్లాండ్ జట్టుకు ఎంపిక కాలేదు. ఆ సమయంలోనే ఆమె విరాట్ కోహ్లీపై ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ఆ ట్విట్ లో ఏముందో తెలుసుకుందామా..! స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటే ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్లేయర్. అందులో మహిళా అభిమానులు అయితే ఆయనను ఆరాధిస్తారు అనుకోండి. అలాగే మహిళా క్రికెటర్ వ్యాట్ 2014లో “కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో ” అనే క్యాప్షన్ తో ట్విట్ చేసింది.
తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్ లో ఆమె సెంచరీతో మెరిసింది. ఇదే సమయంలో ఆమె గతంలో చేసిన ట్వీట్ ను ఎవరో సోషల్ మీడియాలో రీ ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా వ్యాట్ సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయింది. దీంతో కొంతమంది అభిమానులు మాత్రం డాని కోహ్లీ అంటూ కామెంట్స్ కూడా పెట్టారు. టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు లీగ్ దశలో ఆడినటువంటి మూడు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది. జట్టు సెమీస్ కు చేరుతుందా లేదా అనే అనుమానాలు కూడా కలిగాయి. ఎట్టకేలకు సెమీస్ లో అడుగుపెట్టి, సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి ఫైనల్ కు చేరి చివరికి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.