బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే గురించి తెలిసిందే. ఆల్ ఇండియా వైడ్ క్రేజీ సంపాదించడమే కాకుండా హాలీవుడ్ లోనూ సినిమాలు చేసి వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకుంది. సౌత్ ఇండియా నుండి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో పాగా వేసింది.
రణవీర్ సింగ్ అని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది.
తాజాగా వీరిద్దరూ కాఫీ విత్ కరణ్ సీజన్ 8 షోలో పాల్గొన్నారు. దీపిక పెళ్లి నాటి వీడియోను ఈ షోలో ప్రదర్శించారు. దీపిక తాను 2013లో హే జవాని హై దీవాని సినిమా షూటింగ్ అప్పుడు ఒక మెహందీ ఆర్టిస్ట్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ విషయాన్ని హెన్నా ఆర్టిస్ట్ వీణ నగ్డ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పంచుకున్నారు.
హే జవానీ హై దివానీ సినిమాకి పనిచేసినప్పుడు దీపిక తన పెళ్లికి వీణానీ మెహందీ పెట్టడానికి పిలుస్తానని మాట ఇచ్చారట.ఇచ్చిన మాట ప్రకారం దీపిక తన పెళ్లి సమయంలో వీణానీ పిలిపించుకుని మెహందీ పెట్టించుకున్నారు. ఈ విషయం పైన హెన్నా ఆర్టిస్ట్ దీపికా పట్ల తన కృతజ్ఞతలు తెలుపుకున్నారు. దీపిక తన జీవితంలోని బ్యూటిఫుల్ మూమెంట్స్ లో తనని భాగం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకి మాటలు రావడం లేదని అన్నారు.
హే జవానీ హై దివానీ షూటింగ్ అప్పుడు వీణా దీపిక తో పాటు 45 రోజుల పాటు ఉదయపూర్ లో ఉన్నారు. అప్పుడే దీపిక చాలా మంచి వ్యక్తి అని తెలుసుకున్నారట. దీపికా కి హెన్నా డిజైన్లు మంచి క్లారిటీ ఉందని, దీపిక చాలా ఎక్సైట్ అవుతారని తెలిపారు. తనకి ఏ అవకాశం ఇచ్చినందుకు దీపికా పదుకొనేకు, రణవీర్ సింగ్ ఇరువురి కుటుంబాలకి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె తెలిపారు.ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు దీపిక మంచి మనసును మెచ్చుకుంటున్నారు. తమతో పాటు పని చేసిన వారిని గుర్తించి వారికి గౌరవం ఇవ్వడం దీపిక మంచి మనసుకు నిదర్శనమని అంటున్నారు.
Also Read:“రణవీర్ సింగ్” కంటే ముందు… “దీపికా పదుకొనే” రిలేషన్షిప్లో ఉన్న 8 మంది సెలబ్రిటీలు..!