హైపర్ ఆది, సూది గాలి సుధీర్, రష్మీ యాంకర్ ప్రదీప్ వీరు చేస్తున్న ‘ఢీ’ ప్రోగ్రాం లో ఎలాంటి సందడి చేస్తారో అందరికి తెలిసిందే..ఈటీవీ లోని అన్ని ఈవెంట్స్ కి దాదాపుగా స్టేజ్ పైన వీళ్ళే ఉంటారు. ఢీ ప్రోగ్రాం లో కంటెస్టెంట్స్ తో పాటుగా వీరి రచ్చ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది..ఇక జబర్దస్త్ లో పేల్చే పంచ్ డైలాగ్స్ ఏ స్టేజి పైన కూడా కుప్పలు తెప్పలుగా పేలుతాయి.
ఇక ఢీ ప్రోగ్రాం లో గెలిచినా టీం ఓడిన టీం కి ఇచ్చే టాస్క్ ల గురించి తెలిసిందే.. టాస్క్ ఇవ్వడానికి వచ్చిన రష్మీ తో ససేమిరా చేయమని వాగ్వాదానికి దిగుతాడు హైపర్ ఆది మేము చేయము మాకు లేదు మూడ్ చేయడానికి అని అంటాడు.. మరి మాకు ఉంది మూడ్ అని అంటుంది రష్మీ.. మీకు ఉంటె మీరే చేసుకోండి అంటూ పంచ్ వేస్తాడు ఆది..
స్టేజ్ పై కుర్చీలో ఉన్న ఆది వకీల్ సాబ్ స్టైల్ లో డైలాగ్స్ చెబుతాడు ఆది .. అలా తన కంటెస్టెంట్స్ తో వెళ్లి కూర్చుకున్న ఆది.. వకీల్ సాబ్ లోని ప్రకాష్ రాజ్ డైలాగ్ ని సుడిగాలి సుధీర్ తో ఇలా అంటాడు’ ఆర్ యూ విర్జిన్ అని మళ్ళీ మళ్ళీ అదే డైలాగ్స్ చెబుతూ సుధీర్ ని ఇరకాటం లో పడేస్తాడు ఆది. మొత్తానికి సుధీర్ మాత్రం జవాబు ఇవ్వకుండా భలేగా ఎస్కేప్ అవుతాడు..