ఒక మహిళకి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కి మధ్య జరిగిన గొడవ నోయిడాలోని హౌసింగ్ సొసైటీలో చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఇద్దరి మధ్య లిఫ్టులో జరిగిన గొడవ చిరిగి చిరిగి గాలివానంత అయింది.
అసలు విషయానికి వస్తే నోయిడా సెక్టార్ 108 వద్ద ఉన్న పార్క్స్ లారీయేట్ సొసైటీలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ గొడవ జరిగింది. ఈ గొడవ అంతటికీ కారణం ఆ హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్న దంపతులు తమ పెంపుడు కుక్కని లిఫ్ట్ లోకి తీసుకురావడమే. దీని కారణంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కి మహిళకి గొడవ మొదలైంది.
ఈ గొడవ జరిగేటప్పుడు మహిళా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫోను ను బయటికి విసిరేసింది. అతను సహాయం కోల్పోయి ఆ మహిళ చెంప మీద కొట్టాడు.ఈ గొడవలో ఆ మహిళ భర్త రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటనలో సొసైటీలో ఉన్న మిగతా కుటుంబాల వారు సెక్యూరిటీ గార్డులు వారిని ఆపడానికి ప్రయత్నించారు. అదంతా వీడియోలో రికార్డు అయింది.
ఈ ఘటన పైన నోయిడా ఎసిపి రాజనీష్ వర్మ మాట్లాడుతూ తమకి సోమవారం సాయంత్రం ఈ గొడవకు సంబంధించి ఒక ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. వెంటనే పోలీసు సిబ్బంది సొసైటీ వద్దకు వెళ్లారని తెలియజేశారు. అయితే ఈ గొడవలో ఇరు పార్టీల వారు సొసైటీ మీటింగ్ లోను సెటిల్ చేసేసుకున్నట్లుగా తెలిపారు. తమకి ఎటువంటి కంప్లైంట్ రాలేదని ఇద్దరిలో ఎవరికీ కూడా ఎటువంటి గాయాలు కాలేదని ఎసిపి తెలియజేశారు.
Also Read:ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా గెలిస్తే పాకిస్తాన్ ఎందుకు ఆనందపడుతోంది..? కారణం ఏంటంటే..?