యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఎప్పుడు వైవిధ్యం కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుకే ఆయన చేసే సినిమాలు ఉన్నాయి. తాజాగా ఆయన వెబ్ సిరీస్ లో కూడా అడుగు పెడుతున్నారు. దూత అనే వెబ్ సిరిస్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. డిసెంబర్ ఒకటో తారీఖున అమెజాన్ ప్రైమ్ లో దూత వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. నాగచైతన్యతో మనం థాంక్యూ మూవీలు డైరెక్ట్ చేసిన విక్రమ్ కుమార్ ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసారు.
అయితే తాజగా దూత వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో నాగచైతన్య జర్నలిస్టు పాత్రలో కనిపించి ఉన్నాడు. అభ్యంతరం సస్పెన్స్ ఓరియంటెడ్ గా ఈ ట్రైలర్ ఉంది. దూత ద మెసెంజర్ అంటూ ఏదో ఇంట్రెస్టింగ్ గానే ప్లాన్ చేశారు. అయితే ఈ ట్రైలర్లు ఒక హీరోయిన్ మాత్రం అందర్నీ బాగా ఆకట్టుకుంది. ఆమె ఎవరో అంటూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
తీరా చూస్తే ఆమె ఎవరో కాదు మలయాళం నటి పార్వతి తిరువోతు.మలయాళం లో బాగా ఫేమస్ అయిన హీరోయిన్. నేషనల్ అవార్డు విన్నర్ కూడా. 2006 సంవత్సరంలో అవుట్ ఆఫ్ సిలబస్ మూవీ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తర్వాత 2014లో వచ్చిన బెంగుళూరు డేస్ మూవీ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈనటి ఒక్క మలయాళంకే పరిమితం కాలేదు. తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా నటించింది.మలయాళ చిత్రాలు చూసే ఎవరికైనా సరే పార్వతి అంటే తెలుస్తుంది.కమల హాసన్ ఉత్తమ విలన్ చిత్రంలో కూడా నటించింది.నవరస అనే వెబ్ సిరీస్ లో కూడా మంచి పాత్ర చేసింది.
ఫస్ట్ టైం తెలుగులో దూత వెబ్ సిరీస్ తో అడుగు పెడుతోంది. ఈమె నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయిన సందర్భం ఉంది.కానీ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ మాత్రం దూత…!ఈమె తన సినీ కెరీర్ లో ఎన్నో అవార్డులను పొందారు. ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, కేరళ స్టేట్ అవార్డ్స్,సైమా అవార్డ్స్,ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్, iifa ఉత్సవ్ అవార్డ్స్ ఇలా ఎన్నో అవార్డ్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. పార్వతి తెలుగులోకి ఎప్పుడో రావాల్సి ఉంది కానీ కుదరలేదు. దూత సీరీస్ క్లిక్ అయితే పార్వతి తెలుగులో కూడా బిజీ అయ్యే ఛాన్స్ ఉంది…!
Watch Trailer: