నిన్న జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ భారత్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టింది. ముందు నుంచి కూడా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ ఆడిన 9 మ్యాచ్ లలో విజయాన్ని నమోదు చేసుకుని సెమీఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. సెమీఫైనల్స్ లో భారత్ ప్రత్యర్ధి న్యూజిలాండ్ అనగానే భారత అభిమానులు అందరూ కంగారుపడ్డారు. ఎందుకంటే ఇంతకు ముందు 2019 సెమీఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది.
ఆ చేదు జ్ఞాపకాలాన్ని అందరి మది లోనూ ఉన్నాయి. మళ్లీ అలాంటి ఫీట్ జరుగుతుందేమో అని భయపడ్డారు.కానీ అందరి ఆశలను నిలబెడుతూ భారత్ సెమీఫైనల్ లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. మధ్యలో కాస్త తడబడిన కూడా మళ్లీ పుంజుకుని విజయాన్ని ఖరారు చేసింది.
భారత్ ను ఒంటి చేత్తో ఫాస్ట్ బౌలర్ షమి ఫైనల్ మ్యాచ్ కి చేర్చాడు. అద్భుతంగా ఏడు వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. నిన్నంతా కూడా ఇది సెమీఫైనల్ మ్యాచ్ కాదు షమీ ఫైనల్ మ్యాచ్ అంటూ పొగడ్తలతో ముంచేస్తారు. ఆ రేంజ్ లో షమీ ప్రదర్శన ఉంది.అయితే ఇప్పుడు ఇంటర్నెట్ లో ఏడు వికెట్ల గురించి ఒక ట్వీట్ బాగా వైరల్ అవుతుంది. నవంబర్ 14 వ తారీకున ఒక వ్యక్తి షమీ 7 వికెట్లు తీసినట్లు కల వచ్చింది అంటూ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అతను కలకన్న విధంగానే షమీ 7 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేదా అతనికి ఏమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా అంటూ అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇప్పుడు భారత్ వరల్డ్ కప్ నెగ్గినట్లు కలకనమంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకా ఒక్క అడుగు దూరంలో వరల్డ్ కప్ ఉంది. దాన్ని భారత్ కైవసం చేసుకోవాలని 150 కోట్ల భారత అభిమానులందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎవరు ఎన్ని కలలు కన్నా ఆ కలలని నిజం చేయాలని కోరుకుంటున్నారు. భారత్ వరల్డ్ కప్పును నెగ్గుతుందని అందరం ఆశిద్దాం… ఆల్ ద బెస్ట్ టీమిండియా.
Also Read:సచిన్ బ్యాటింగ్ రికార్డ్స్ మాత్రమే కాదు… బౌలింగ్ లో కూడా ఇన్ని రికార్డ్స్ సాధించారని తెలుసా..?