భారతదేశంలో ఏ పని చేయాలన్నా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు. వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకోవడానికి ఇతర వ్యాపారాలు మొదలుపెట్టడం చేస్తుంటారు. అయితే కొన్ని వాస్తు దోషాలు మనల్ని విపరీతమైన సమస్యలను తెచ్చిపెడతాయి. ఈ వాస్తు దోషాలు ఉన్న వారు పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోతారు. అవేంటో తెలుసుకుందాం..!!
ముఖ్యంగా మీ ఇంట్లో చెత్త బుట్టలను ప్రధాన ద్వారం దగ్గర అసలు ఉండకూడదు. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.అలాగే రాత్రి సమయంలో వంట గదిలో తిన్నటువంటి పాత్రలను అలాగే పెట్టరాదు. మరియు వంట వండిన తర్వాత స్టవ్ ను క్లీన్ చేయాలి.
అలాగే రాత్రి సమయాల్లో పాత్రలను ఖాళీగా ఉండకూడదు. ముఖ్యంగా వాష్ రూమ్ లో కనీసం ఒక బకెట్ నీరైనా నింపి ఉంచాలి. దీని వల్ల ప్రతికూల శక్తి తొలగించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుండి బయట పడవచ్చు.మరీ ముఖ్యంగా రాత్రి సమయాల్లో బయట వ్యక్తులకు ఉప్పు, పాలు, పెరుగు లాంటి పదార్థాలను ఇవ్వకండి. ఇవి ఇస్తే మనం ఆర్థికంగా వెనుకబడి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.