పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం OG. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ సుజిత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. డివిడి మూవీస్ బ్యానర్ పైన దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50% షూటింగ్ పూర్తి చేసుకుంది. గ్యాంగ్ స్టార్ వరల్డ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇప్పటివరకు చూడని విధంగా సుజిత్ తెరపైన ప్రజెంట్ చేయనున్నాడు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ OG తో పాటు నాలుగు సినిమాలు చేస్తున్న కూడా అందరి అంచనాలు OG సినిమా మీదే ఉన్నాయి. ముంబై పూణేల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్ గాని, స్వాగ్ గాని అద్భుతంగా ఉన్నాయి.
సుజిత్ భయ్యా నీకు గుడి కట్టిన తప్పులేదు మా పవర్ స్టార్ ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నావంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ఇప్పటికే OG సినిమాలో హంగ్రీ చీతా పాట కూడా తెగ వైరల్ అవుతుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగింది. ఆయన డేట్ లు చూసుకునే సినిమాని పూర్తి చేసి 2024 లో ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అయితే OG సినిమా అనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర నుండి షూటింగ్ జరుపుకునే ప్రతిసారి డివివి మూవీస్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ఏదో ఒక అప్డేట్ ఇచ్చేవారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లు ఇవ్వడం లేదు.అయితే ఒక అభిమాని ట్విట్టర్ ద్వారా డివివి మూవీస్ ని OG అప్డేట్ ఇవ్వరా అంటూ కామెంట్ చేశాడు…. దానికి డివివి మూవీస్ టీం”ఇస్తాను లేరా..! ప్రజంట్ షూటింగ్ ఏమి జరగట్లేదు,మళ్ళీ స్టార్ట్ అయ్యాక చెప్తాలే” అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. వీరిద్దరి కన్వర్జేషన్ చూసిన ఎవ్వరైనా సరే నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఫ్యాన్స్ ని ఆనందపరచడంలో వారికి అప్డేట్ ఇవ్వడంలో డీవివి మూవీస్ తర్వాతే ఎవరైనా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ పొగడేస్తున్నారు.
Isthaanule ra. Present shoot em cheyatledu. Malli start ayyaaka chepthaale.
— DVV Entertainment (@DVVMovies) November 13, 2023
Also Read:అవికా గోర్ నటించిన కొత్త వెబ్ సిరీస్ రిలీజ్ ఎప్పుడంటే…!