మాస్ మహారాజ రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిక్సడ్ టాక్ తో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని సాధించింది. ఇప్పుడు రవితేజ తన నెక్స్ట్ సినిమా హడావిడిలో పడిపోయాడు.తాను నటిస్తున్న ఈగల్ చిత్రం అఫీషియల్ టీజర్ తాజాగా విడుదలైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సినిమా టీం ప్రకటించింది.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరం ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో రాబోతుంది, జాన్ విక్ టైపు టచ్ తో ఉండబోతుందని టీజర్ ద్వారా తెలియజేశారు.
కొంచెం డిఫరెంట్ గా ఈ సినిమాను తీయగా క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉన్న టీజర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. ఇక విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉండగా రవితేజకి ఇచ్చిన ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. ఆ తర్వాత రవితేజ ఎంట్రీ సీన్ అలాగే రవితేజ లుక్ టీజర్ కి హైలైట్ గా నిలిచాయి. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా మెయిన్ పాయింట్ ఏమి రివిల్ చేయలేదు కానీ అందరూ ఒక వ్యక్తి కోసం వెతుకుతూ ఉండగా ఆ వ్యక్తి ఈగల్ గా తిరుగుతూ టైం కోసం ఎదురుచూసి వార్ చేస్తే ఎలా ఉంటుందో అనిపించే కథ లాగా ఉండబోతుంది అని తెలుస్తుంది.
ఓవరాల్ గా టీజర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెంచేసింది. సంక్రాంతికి భారీ పోటీ నడుమ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండగా ఆ టైంలో ఈ కాన్సెప్ట్ మూవీని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. ఒకవేళ బాగా రిసీవ్ చేసుకుంటే మాత్రం బాక్సాఫీస్ దగ్గర రవితేజ స్టామినా ఏంటో చూపించే అవకాశం లభిస్తుంది. కానీ ఈ టీజర్ చూసిన మాస్ మహారాజా అభిమానులైతే ఫుల్ మీల్స్ అంటూ సంబరపడుతున్నారు. రవితేజ మీసం తిప్పిన లుక్ అయితే అద్భుతంగా ఉంది.
Watch Teaser: