సినిమా విడుదల అయితే ఎంత ఆలస్యం అయితే, ప్రేక్షకులలో అంత ఆసక్తి పెరుగుతుంది. ఆ క్యూరియాసిటీ నుండి కొత్త కొత్త కథలు బయటికి వస్తూ ఉంటాయి. “సినిమాలో ఇలా జరిగి ఉండొచ్చు ఏమో”, “అలా జరిగి ఉండొచ్చు ఏమో” అని కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా కామెంట్స్ లో కనిపించే చాలా విషయాలు నిజం కూడా అవుతాయి. ఇప్పటికే ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవ్వడంతో దేశం మొత్తం ఈ సినిమా గురించి చర్చలు ఎప్పుడో మొదలయ్యాయి. మొదటిసారిగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆలియా భట్ తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెడుతున్నారు. మార్చి 15 వ తేదీన ఆలియా భట్ పుట్టినరోజు. సందర్భంగా ఈ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న ఆలియా భట్ యొక్క ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
దీంతో చాలా మంది నెటిజన్లు ఆలియా భట్ ఫస్ట్ లుక్ డీకోడ్ చేయడం మొదలుపెట్టారు. ఆలియా భట్ మెడలో ఉన్న లాకెట్ అంతకుముందు రామరాజు ఇంట్రడక్షన్ వీడియోలో రామ్ చరణ్ లాకెట్ లా కనిపించింది. దాంతో ఆలియా భట్ పాత్ర, రామ్ చరణ్ పాత్రకి ఆ లాకెట్ ఇచ్చి ఉండవచ్చు అని సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి.
# అయితే, రాజమౌళి తన సినిమాల్లో లాకెట్ కి ప్రాముఖ్యత ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు యమదొంగ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ఉండే కథలో లాకెట్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది.
# ఛత్రపతి సినిమాలో కూడా భానుప్రియ గారు ప్రభాస్ కి ఇచ్చే శంఖం ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. ఒక రకంగా భానుప్రియ గారు, ఇంకా ప్రభాస్ కి మధ్య వచ్చే స్టోరీని ముందుకు తీసుకెళ్లడంలో ఈ శంఖం పాత్ర ఉంటుంది.
# అలాగే బాహుబలి సినిమాలో కూడా మహేంద్ర బాహుబలి మెడలో శివలింగం ఉంటుంది.
# అలాగే ఈగ సినిమాలో కూడా సమంత ఒక లాకెట్ తయారు చేయడం కోసం చాలా కష్టపడతారు. చివరికి అది తయారు చేసి నానికి చూపిద్దామని తీసుకువచ్చే లోపు నానిని రౌడీలు తీసుకెళ్లిపోతారు. మరి ఇది కోఇన్సిడెన్సా? లేక నిజంగానే రాజమౌళి తన కథలో లాకెట్ కి ప్రాధాన్యత ఇస్తారా? అనేది మాత్రం ఎవరికీ తెలియదు.