సినిమాలన్నీ చాలా వరకు మన నిజ జీవితాల నుండి తీస్తూ ఉంటారు. చాలామంది డైరెక్టర్లు బయట క్యారెక్టర్లను ఇన్స్పైర్ అయ్యి సినిమాలో రాస్తూ ఉంటారు. అలా తెరపై చూపించే హ్యూమన్ ఎమోషన్స్ మనల్ని విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అలా తండ్రి పాత్రలో నటించి అలరించి నటులు ఎంతోమంది ఉన్నారు. ఆ సినిమాలు చూస్తే తండ్రులు గాని కొడుకులు, కూతుళ్లు గాని ఎమోషనల్ అయిపోతుంటారు.
1. చిరంజీవి-డాడి
మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ మూవీ తండ్రీ కూతుర్ల బంధాలు అనగానే మొదటి గుర్తు వస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి తన కూతురు మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే కూతురు చనిపోయినప్పుడు వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే కంటతడి పెట్టించాయి.
2. వెంకటేష్ – సైంధవ్
విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్షన్లో వస్తున్న మూవీ సైంధవ్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ మూవీలో తండ్రీ కూతుర్ల బంధాన్ని హైలైట్ చేసి చూపిస్తున్నారని టాక్.
3. నాని-హాయ్ నాన్న
నేచురల్ స్టార్ నాని హీరోగా మృనాల్డ్ ఠాకూర్ హీరోయిన్గా వస్తుంది చిత్రం హాయ్ నాన్న. ఈ మూవీ డిసెంబర్ ఏడో తారీఖున విడుదల కానుంది. ఈ మూవీలో కూడా తండ్రి కూతుర్లు ఎమోషన్ బలంగా చూపిస్తున్నారు. జెర్సీ మూవీ అందరికీ గుర్తు ఉంటుంది. అది తెలుగులో వచ్చిన ఒక కల్ట్ మూవీ. ఈ మూవీలో నాని తండ్రి పాత్రలో నటించాడు. తన కొడుకుకి జెర్సీ కొన్నివ్వడం కోసం తన చేసే ప్రయత్నం అందరి చేత కంటతడి పెట్టిస్తుంది
4. నవీన్ పోలిశెట్టి – మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టికి చివరిలో ఒక పాప పుడుతుంది.
5. విక్రమ్-నాన్న
తమిళ్ హీరో విక్రమ్ ప్రయోగాత్మకంగా నటించిన చిత్రం నాన్న. లేడీ సూపర్ స్టార్ అనుష్క ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో తండ్రిగా విక్రమ్ చూపించిన హావభావాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి.
6. ప్రకాష్ రాజ్-ఆకాశమంత
వెర్సటైల్ నటుడు ప్రకాష్ రాజ్ నాన్నగా నటించి త్రిష హీరోయిన్గా నటించిన చిత్రం ఆకాశమంత. ఈ చిత్రంలో కూతురు మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్న తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ అలరించారు.
7. నాగబాబు-చందమామ
మెగా బ్రదర్ నాగబాబు నాన్నగారు నటించిన సినిమా చందమామ. ఇందులో హీరోయిన్ కాజల్ నాగబాబు కూతురుగా నటించింది. ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా సహజత్వంగా అనిపిస్తాయి.
8. రవితేజ-విక్రమార్కుడు, క్రాక్
మాస్ మహారాజా తండ్రిగా నటించి అలరించిన చిత్రం విక్రమార్కుడు. ఈ చిత్రంలో రవితేజ కీర్తన కూతురికి మధ్య వచ్చే సీన్స్ దర్శకుడు రాజమౌళి అద్భుతంగా తర్కెక్కించారు. అంతే కాకుండా క్రాక్ సినిమాలో కూడా రవితేజ ఒక బాబుకి తండ్రిగా నటించారు.
9. కార్తీ-ఖైదీ
తమిళ్ హీరో కార్తీ నటించిన ఖైదీ చిత్రంలో ఒక కూతురు కోసం తండ్రి పడే తపనను డైరెక్టర్ లోకేష్ కనగరాజు అద్భుతంగా ఆవిష్కరించారు. తన కూతురును చూసేందుకు తండ్రి పడి ఆరాటం అందర్నీ కట్టిపడేస్తుంది.
10. ధనుష్-మారి 2
తమిళ్ స్టార్ ధనుష్ నటించిన మారి 2 సినిమాలో ధనుష్ తండ్రి పాత్రలో నటించారు. తల్లి చనిపోయిన తర్వాత తన కొడుకుని ధనుష్ పెంచే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.
11. రజనీకాంత్ – జైలర్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో కూడా తండ్రీ కొడుకులు ఎమోషన్ బాగా పండింది. కనపడకుండా పోయిన తన కొడుకుని వెతికే తండ్రి ప్రాతలో రజనీకాంత్ జీవించేసారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
12. నాగార్జున – బంగార్రాజు
అక్కినేని నాగార్జున నాగచైతన్య బయట నిజమైన తండ్రీ కొడుకులే. మీరు సినిమాలో కూడా తండ్రీకొడుకులుగా నటించి అందర్నీ అలరించారు. బంగార్రాజు సినిమాలో వీరినటన అందరి మెప్పు పొందింది.