వ్యాపారం అంటే కేవలం చదువుకోని వాళ్ళు మాత్రమే చేసేది కాదు. విద్యావంతులు కూడా వ్యాపారాన్ని చేయొచ్చు. వాళ్లకు ఉండే నైపుణ్యం, ఆసక్తితో వ్యాపారంలో కూడా రాణించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది కనుక అవకాశాలు మరింత పెరిగాయి. నిజంగా మనకి ఉండే ఆసక్తి, నైపుణ్యం చాలు మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళడానికి. అయితే ఈ రోజు మనం తన వ్యాపారంతో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆచర్ హిందర్ గురించి తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళితే… కర్ణాటక రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఆచర్ హిందర్ . సాధారణంగా ఉదయం 9 నుండి 5 గంటల వరకు చేసే ఉద్యోగంలో జీతం తక్కువ ఉంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది. పైగా ఎవరు ఎప్పుడు ఏం చెప్తే ఆ పనులు చేయాల్సి ఉంటుంది. మన స్వంత నిర్ణయాలు తీసుకోవడం… మనకి నచ్చినట్లు పని చేయడం అస్సలు కుదరదు. కానీ వ్యాపారంలో చూసుకున్నట్లయితే మొత్తం అంతా మనమే చూసుకోవాలి. మన నైపుణ్యంతో తెలివితో రాణించాలి. నిజంగా ఒకసారి కనుక వ్యాపారం క్లిక్ అయితే లాభాలు వస్తూనే ఉంటాయి. ఇది నేను చెబుతున్నది కాదు సుభాష్ రుజువు చేసింది.
ఈ యువకుడు సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదులుకుని సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. ప్రతి నెల ఎంత వస్తుందో తెలుసా..? వందల్లో, వేలల్లో కాదండీ… ఏకంగా నెలకి లక్ష రూపాయల పైగా సంపాదిస్తున్నాడు. పుత్తూరు లోని వివేకానంద కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత నెలకి రూ. 22 వేల నెలవారి వేతనం తో ఒక ప్రైవేటు సంస్థలో పని చేయడం మొదలు పెట్టాడు. ఉద్యోగమంటే విసిగిపోయిన ఆచర్ హిందర్ వ్యాపారం చేయాలని అనుకున్నాడు.
వ్యవసాయంలో తండ్రికి అప్పుడప్పుడు సాయం చేసే ఆచర్ హిందర్ కి వ్యవసాయంపై కాస్త పట్టు కూడా వుంది. 10 ఆవులతో ఎక్కువసేపు గడుపుతూ దానినే వ్యాపారంగా మార్చేశాడు. మొదట 10 ఆవులు ఉండగా వాటి సంఖ్య ఇప్పుడు 130 కి చేరింది. ప్రతిరోజూ 750 లీటర్ల పాలు మరియు నెలకి ముప్పై నుండి నలభై కిలోల నెయ్యిని అమ్ముతున్నాడు. వీటి కోసం పది మంది వర్కర్లను కూడా పెట్టుకున్నాడు. బిజినెస్ డెవలప్మెంట్ కోసం యూట్యూబ్ ని ఉపయోగించుకున్నాడు. అలానే ఆవు పేడని ఆరబెట్టే యంత్రాన్ని కూడా కొనుగోలు చేసి ప్యాకింగ్ చేసి వాటిని విక్రయిస్తున్నాడు. తర్వాత అతను ప్రతి నెలా వెయ్యి కోట్ల ఆవు పేడని విక్రయిస్తూ అద్భుతమైన లాభాలను పొందుతున్నాడు. అంతే కాకుండా ఆవు మూత్రం, ఆవుపేడ, ఆవుకి స్నానం చేసిన నీళ్లని కూడా వినూత్న రీతిలో ట్యాంకర్ల ద్వారా రవాణా చేస్తున్నాడు. అలానే పంటలని కూడా పండిస్తున్నాడు.