ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులు గా చేస్తారు..కట్ చేస్తే కొన్ని రోజుల్లోనే అవాక్కయేలా మారిపోయి ఉంటారు ఇలా తెలుగు సినిమాల్లో కొందరిని చూసాము. అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఎస్తేర్ అనిల్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్లో వైరల్ గా నిలిచాయి. ఎస్తేర్ అనిల్ సొంత ఊరు కేరళ అక్కడ ప్రతి ఏడాది ఓనం పండుగని ఘనంగా నిర్వహిస్తారు. వారి ఆచారాలు, పద్ధతులకు అనుగుణంగా నడుస్తూ ఉంటాయి. ఇటీవలే జరిగిన ఓనం పండుగ సెలెబ్రేషన్స్ లో ఫోటోషూట్ నిర్వహించిన ‘ఎస్తేర్ అనిల్ ‘ దృశ్యం సినిమా లో మనం చూసింది ఈ పిల్లనేనా అంటూ అందరూ అవాక్కవుతున్నారు. దృశ్యం సినిమాలో నటించిన ఎస్తేర్ అనిల్.. దృశ్యం 2 లో కూడ నటించింది ఇక త్వరలో ఓటిటి లో ఈ సినిమా విడుదల అవ్వనుంది.జోహార్ అనే సినిమాలో కూడా నటించింది ఎస్తేర్ అనిల్.